Saturday, October 12, 2024
HomeఆటGarla: క్రీడలతోనే మానసిక ఉల్లాసం

Garla: క్రీడలతోనే మానసిక ఉల్లాసం

14 స్కూళ్ల స్టూడెంట్స్..

క్రీడల తోనే మానసిక, ఉల్లాసం శారీరక సామర్థ్యాం పెరుగుతాయని ఎంఈఓ వీరభద్రరావు అన్నారు. స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో మండల స్థాయి ఆటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ఎంఈఓ వీరభద్రరావు ప్రారంభించారు.

- Advertisement -

క్రీడలు వ్యాయామం శారీరక దృఢత్వానికి మానసిక పరిపక్వత మానసికాభివృద్ధికి దోహదం చేస్తాయని, క్రీడా పోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ పోటీల్లో మండలంలోని 14 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా మొదటి రోజు బాలికలకు జూనియర్ సీనియర్ విభాగంలో కబడ్డీ వాలీబాల్ కోకో పోటీలను నిర్వహించారు.

ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు స్కూల్ గేమ్ మండల కోఆర్డినేటర్ జ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామచంద్రు శివ భాస్కర్ వీరన్న వీరు రమేష్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ సిపిఎం పార్టీ నాయకులు కందునూరి శ్రీనివాస్ రిటైర్డ్ టీచర్లు ఎడ్ల అప్పయ్య వజ్రం నాగేశ్వరరావు వివిధ పాఠశాలల పిటిలు ఉపాధ్యాయులు విద్యార్థులు క్రీడా అభిమానులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News