Sunday, July 7, 2024
HomeఆటGautam Gambhir: బ్లాంక్ చెక్ ఇస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది

Gautam Gambhir: బ్లాంక్ చెక్ ఇస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది

బీసీసీఐ కొత్త కోచ్ ఎవరని ఉత్కంఠ

బ్లాంక్ చెక్ ఇస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేందుకు లేటెస్ట్, లివింగ్ ఎగ్జాంపుల్ కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీ గెలవటమని ఇంటర్నెట్ కోడై కూస్తోంది. అవును మరి.. కేకేఆర్ యాజమాన్యం గౌతం గంభీర్ కు ఈ స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందట. అందుకే 10 ఏళ్ల తరువాత షారూఖ్ ఖాన్ టీం కోల్కత్తా నైట్ రైడర్స్ కప్ కొట్టగలిగింది. ఇదే విషయాన్ని కేకేఆర్ టీం మొత్తం వివరించింది. తమ మెంటార్ కారణంగానే ఇది సాధ్యమైందని టీం మొత్తం గౌతం హార్డ్ వర్క్ ను వివరిస్తోంది.

- Advertisement -

కనీసం రానున్న 10 ఏళ్లపాటు మాతోనే కోచ్ గా ప్రయాణం చేయాలి అంటూ కోల్కత్తా నైట్ రైడర్స్ యజమాని షారూఖ్ ఖాన్ కేకేఆర్ కోచ్ గౌతం గంభీర్ కు బ్లాంక్ చెక్ ఆఫర్ చేశారనే న్యూస్ ఇప్పుడు చాలా వైరల్ గా మారింది.

ఇండియా హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ ను రిక్రూట్ చేసేందుకు బీసీసీఐ చాలా కసరత్తు చేస్తోంది. ఇప్పుడు విన్నింగ్ హార్స్ గా అందరికీ గౌతం కావాలి మరి. ఇక ఇటీవలనే యాక్టివ్ పాలిటిక్స్ కు కూడా గుడ్ బై చెప్పి, లోక్ సభ బరిలోకి దిగకుండా పూర్తిగా ఆటమీదే గౌతం ఫోకస్ పెట్టడంతో కాంబ్లి, రాహుల్ ద్రావిడ్, లక్ష్మణ్ తో పాటు అత్యుత్తమమైన కోచ్ గా గంభీర్ కూడా క్రికెట్ కోచ్ ల్లో అత్యంత ప్రతిభాశాలిగా రికార్డుకెక్కారు.

మరోవైపు బీసీసీఐకు పెద్ద ఆప్షన్ కూడా దిక్కులేకుండా పోయింది. ఓ వైపు ఫారిన్ కోచ్ లంతా .. వామ్మో టీం ఇండియా కోచ్ గా ఉన్న పొలిటికల్ హెడేక్స్, ప్రెజర్స్, పాలిటిక్స్ అస్సలు భరించలేమని చేతులెత్తేస్తుంటే మరి ఇక మిగిలిన ఏకైక ఆప్షన్ మన ఇండియన్స్ నే కోచ్ గా ఎంపిక చేసుకోవటం.

దైనిక్ జాగరణ్ అనే హిందీ డైలీ కథనం ప్రకారం గౌతంకు టీం ఇండియా కోచ్ గా పనిచేయాలని ఈమధ్య చాలా ఇంట్రెస్ట్ పెరిగిందట. కానీ తనకు పూర్తి స్వేచ్ఛను ఇస్తేనే టీం సెలక్షన్ మొదలుకుని ఇతర అంశాల్లో ఫ్రీ హ్యాండ్ ఇస్తే కోచ్ పోస్ట్ లో చేరతానని గౌతం ఇప్పటికే బీసీసీఐకు క్లియర్ గా చెప్పేశారట. ఒకవేళ బీసీసీఐ ఇందుకు ఓకే అంటే టీం ఇండియాకు ఖతర్నాక్ కోచ్ దొరికినట్టే. మరి కేకేఆర్ ను వదిలి టీం ఇండియా కోచ్ బాధ్యతలు చేపడతారా లేక ఇలాగే కొనసాగుతారా అన్నది త్వరలో తేలనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News