Asia Cup 2025 Final: టీమిండియా తొమ్మిదోసారి ఆసియా కప్ ను ముద్దాడింది. దీంతో అత్యధిక సార్లు ఆసియా కప్ ను గెలిచిన జట్టుగా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో పాక్ పై నెగ్గింది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే మ్యాచ్ ను గెలిపించే ప్రయత్నంలో తిలక్ కొట్టిన సిక్స్ కు టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్ గా మారింది.
పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా గెలవాలంటే చివరి ఓవర్‌లో పది పరుగులు చేయాలి. ఆ సమయంలో క్రీజులో తిలక్, రింకూ సింగ్ ఉన్నారు. లాస్ ఓవర్ వేసేందుకు పాక్ స్టార్ బౌలర్ హారిస్ రౌఫ్ వచ్చాడు. అప్పటికే హారిష్ ను చితక్కొట్టారు భారత బ్యాటర్లు. అయితే పాక్ కెప్టెన్ మళ్లీ అతడికే చివరి ఓవర్ వేసేందుకు అవకాశం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతడు తీసుకున్న నిర్ణయం తప్పనీ కాసేపటికే తిలక్ నిరూపించాడు.
ఆఖరి ఓవర్ తొలి బంతికి తిలక్ వర్మ రెండు పరుగులు సాధించాడు. రౌఫ్ వేసిన రెండో బంతిని తిలక్ భారీ సిక్సర్ గా మలిచాడు. ఆ సమయంలో గౌతమ్ గంభీర్ అద్భుతమైన రియాక్షన్ ఇచ్చాడు. కుర్చీలో కూర్చున్న చోటు నుంచే చేతితో టేబుల్‌ను గట్టిగా కొట్టడం ప్రారంభించాడు. అది ఎక్స్ప్రేషన్ కాస్త వైరల్ గా మారింది. తిలక్ కొట్టిన ఆ సిక్స్ టీమిండియా గెలుపును దాదాపు ఖరారు చేసింది. మిగిలిన పనిని రింకూ సింగ్ పూర్తి చేశాడు. అతను బౌండరీ కొట్టి జట్టుకు కప్ ను అందించాడు. గతంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఓవల్ టెస్ట్‌లో టీమిండియా గెలిచినప్పుడు కూడా గౌతమ్ గంభీర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
ఈ ఫైనల్ పోరులో టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించింది ఇద్దరూ. వారే తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్. దాయాదిపై పోరులో వీరిద్దరూ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశారు. అయితే వీరితోపాటు సంజూ, శివమ్ దూబేల పాత్ర కూడా మరువలేం. తన మణికట్టు మాయజాలంతో కుల్దీప్ నాలుగు వికెట్లు తీయగా.. అద్భుతమైన బ్యాటింగ్ తో తిలక్ 69 పరుగులు చేశాడు. సంజూ 24 పరుగులు, దూబే 33 పరుగులు చేశారు.
Also read: Ind vs Pak final -‘యుద్ధభూమిలోనైనా.. మైదానంలోనైనా టీమిండీయాదే విజయం’..: ప్రధాని మోదీ


