Saturday, April 12, 2025
HomeఆటGMR airport: హైదరాబాద్ చేరుకున్నE-రేసింగ్ కార్లు

GMR airport: హైదరాబాద్ చేరుకున్నE-రేసింగ్ కార్లు

ఫార్ములా Eఛాంపియన్‌షిప్ హైదరాబాద్‌కు వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి ఈ-ప్రిక్స్‌ను నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను నిర్వహించడంలో GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC) బృందం కీలక పాత్ర పోషించింది. విమానాశ్రయంలోని కార్గో విభాగానికి 90టన్నుల రేసింగ్ కార్ల భాగాలు చేరుకున్నాయి. ఫిబ్రవరి 1 తేదీన 11.50 గంటలకు రియాద్ నుండి బోయింగ్ 747-400 చార్టర్ విమానం ద్వారా ఆటో విడిభాగాలు హైదరాబాద్ కార్గో టెర్మినల్‌కు చేరుకున్నాయి. రేసింగ్ కార్ల కార్గో బదిలీ కోసం ఆప్రాన్ నుండి ల్యాండ్‌సైడ్ వరకు ఒక ప్రత్యేకమైన గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. మరో రెండు విమానాలలో మిగతా రేసింగ్ కార్ల భాగాలు హైదరాబాద్ చేరుకోనున్నాయి. నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సర్టిఫికేట్ పొందిన మొట్టమొదటి గ్లోబల్ మోటార్‌స్పోర్ట్, ఫార్ములా-E వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 11 జట్లు పోటీ పడుతున్నాయి, నగరంలో ఇంతకు ముందెన్నడూ చూడని ఆల్-ఎలక్ట్రిక్ అద్భుతమైన మోటో కార్లతో ఉత్సాహాన్ని నింపుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News