‘ఉడాన్ పరి’ అని భారతీయులందరూ ప్రేమగా పిలుచుకునే పీటీ ఉష ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ)కి తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. ఇది ఎందరో క్రీడాకారులకు ముఖ్యంగా మహిళలకు ఎంతో స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. ఈ అథెలెట్ జర్నీ ఎన్నో ‘ట్రాక్’ రికార్డ్సుతో మెరిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ట్రాక్ అండ్ ఫీల్డ్ క్వీన్ ఆమె.
‘గోల్డెన్ గర్ల్’, ‘పరుగుల రాణి’ ఉష పూర్తిపేరు పిల్లఉల్లకండి తెక్కిపెరాంబిల్ ఉష (పిటి ఉష). కోచ్ నంబియార్ సారథ్యంలో అథెలెట్‌గా ఉష తన ప్రయాణం ప్రారంభించింది. పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఎన్నో పతకాలను స్వంతం చేసుకుంది. మంచి అథెలెట్గా పేరు తెచ్చుకుంది. ఇప్పటికీ క్రీడా ప్రేమికులు ఎందరో ఆమెను ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్’ అని పిలుస్తారు.
1980ల్లో ఆమె మొత్తం 23 పతకాలు గెలిస్తే అందులో 14 స్వర్ణాలు. 1985లో జకార్తా ఏషియస్ ఛాంపియన్‌షిప్స్ ఆమె ఆరు మెడల్స్ సాధిస్తే అందులో ఐదు బంగారు పతకాలు. ఒక రజతం. 1986 సియోల్ ఏషియన్ క్రీడల్లో నాలుగు స్వర్ణాలు సొంతం చేసుకుంది. క్రీడా రంగంలో ఆమెఅందించిన అపూర్వ సేవలకుగాను కేంద్రం అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డులను ఉషకు ప్రదానం చేసింది. ఉష భర్త శ్రీనివాసన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తారు. వీరికి ఇద్దరుపిల్లలు.
కేరళలోని పయ్యోలి అనే ఊరిలో ఉష పుట్టింది. ఈ ఊరు లొలికట్కు దగ్గరలో ఉంది. ఉష చాలా పేదకుటుంబంలో పుట్టింది. పేదరికంతోపాటు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. కానీ అథెలిటిక్స్లోలో ఆమె సృష్టించిన వండర్లు ఉషను ట్రాక్ అండ్ ఫీల్డ్లో ‘రాణి’గా నిలబెట్టాయి. ఉష చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి చూపించేది. ఇది ఆమెకు కేరళ ప్రభుత్వ స్కాలర్షిప్ను తెచ్చిపెట్టింది. అలా ఆమె కెన్నూర్‌లోని స్పెషల్ సోర్ట్ స్కూలులో అడ్మిషన్ పొందింది. 1997లో నేషనల్ స్కూలు పోటీల్లో పాల్గొంది. అప్పుడే అక్కడ కోచ్‌గా ఉన్న నంబియార్ కళ్లల్లో పడింది. ఉషలోని ప్రతిభను ఆయన గుర్తించారు. ఆమెలో గొప్ప అథ్లేట్ దాగుందని గుర్తించారు. అదే ఉష జీవితాన్ని అనుకోని మలుపును తిప్పింది. అప్పటి నుంచి ఆమె తన కెరీర్లో ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా క్రీడల్లో భారతదేశ గోల్డెన్ గర్ల్ అయింది ఆమె. 1982లో న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ క్రీడల్లో తన పటిమ ఏమిటో చూపించింది. 100 మీటర్, 200 మీటరులో తన సత్తా చాటింది. 1985లో జరిగిన జకార్తా మీట్ ఐదు బంగారు పతకాలు గెలిచి గోల్డన్ ( స్పింట్‌గా పేరు తెచ్చుకుంది. క్రీడల నుంచి రిటైర్ అయిన తర్వాత కేరళలోని కొచికోడకు సమీపంలో ఉన్న కోయిలాండిలో ఆడపిల్లల కోసం ప్రత్యేక శిక్షణ స్కూల్‌ను ఉష ప్రారంభించింది. 10, 12 సంవత్సరాల వయసు ఆడపిల్లలను ఈ స్కూలులో శిక్షణకు చేర్చుకుంటారు.
1984లో లాస్‌ఏంజిల్స్లో జరిగిన ఒలింపిక్స్ ఆమె క్రీడా కెరీర్లో ముఖ్యమైంది. 400 మీటర్స్ హర్డల్స్‌ను గెలిచి తన ఆటతో వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 1980లో పాకిస్తాన్లోని కరాచీలో జరిగిన ఓపన్ నేషనల్ మీట్లో ఉష పాల్గొంది. అది ఆమె పాల్గొన్న తొలి అంతర్జా తీయ మీట్. ఇందులో నాలుగు బంగారు పతకాలను సొంతం చేసుకుంది. తన కెరీర్లో ఆమె మొత్తం 33 అంతర్జాతీయ మెడల్స్ గెలుచుకుంది. ఏషియన్ గేమ్స్, ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో 13 బంగారు పతకాలు సొంతంచేసుకుంది. అథ్లెటిక్స్‌లో ఆమె ప్రతిభకు గాను 30 ఆమె మొత్తం 33 అంతర్జాతీయ మెడల్స్ గెలుచుకుంది. ఏషియన్ గేమ్స్, ఏషియన్ ఛాంపియ ప్స్ 13 బంగారు పతకాలు సొంతంచేసుకుంది. అథెలిటిక్స్లో ఆమె ప్రతిభకు గాను 30 ఇంటర్నేషనల్ అవార్డులను పొందింది. బెస్ట్ అథ్లెట్‌గా అడిడాస్ గోల్డెన్ షూ అవార్డును కైవసం చేసుకుంది.భారతదేశం గర్వించదగ్గ అత్యంత ప్రతిభావంతురాలైన అథెలెట్ ఉషా – మహిళలకు తరతరాలు నిలిచే నిలువెత్తు స్ఫూర్తి ఆమె.