Saturday, October 5, 2024
HomeఆటGonegandla: ఒంగోలు గిత్తల బండలాగు రాష్ట్రస్థాయి పోటీలు

Gonegandla: ఒంగోలు గిత్తల బండలాగు రాష్ట్రస్థాయి పోటీలు

మండల కేంద్రమైన గోనెగండ్లలోని శ్రీశ్రీశ్రీ చింతల ముని నల్లారెడ్డి స్వామి దశమి ఉత్సవాలను పురస్కరించుకొని ట్రాక్టర్ యూనియన్, వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఒంగోలు గిత్తల బండలాగు పోటీలను శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రారంభించారు.

- Advertisement -

ముందుగా గోనెగండ్ల ట్రాక్టర్స్ యూనియన్ నాయకులు, మండల వైసీపీ నాయకులు పెద్దాయన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి పూల వర్షాన్ని కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఆయన జిల్లా పరిషత్ ఆవరణలో రాష్ట్రస్థాయి ఒంగోలు గిత్తల బండలాగు పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రాక్టర్స్ యూనియన్ నాయకులు, మండలంలోని వైసీపీ నాయకులు ఈ పోటీలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న తగు జాగ్రత్తలు తీసుకుని నిర్వహించుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నసురుద్దీన్, మండల వైసీపీ యూత్ అధ్యక్షులు బందె నవాజ్, వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు తిరుమలరెడ్డి, ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్, డాక్టర్ సీనియర్ నాయకులు నాగప్ప, సాయిబాబా, మస్తాన్, మహబూబ్బాషా, రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News