Monday, December 23, 2024
HomeఆటDevansh: చెస్‌లో సీఎం చంద్రబాబు మనవడు ప్రపంచ రికార్డ్

Devansh: చెస్‌లో సీఎం చంద్రబాబు మనవడు ప్రపంచ రికార్డ్

ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) మనవడు, మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) తనయుడు దేవాంశ్(Devansh) చెస్‌లో వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. వేగంగా పావులు కదపడంలో 9 ఏళ్ల దేవాంశ్‌ ఈ రికార్డు నెలకొల్పారు. ‘‘వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్’’ ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు. దీంతో ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. దేవాంశ్ రికార్డు పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.

- Advertisement -

తన కుమారుడు సాధించిన ఘనత పట్ల లోకేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘‘దేవాంశ్‌ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడు. గ్లోబల్‌ అరేనాలో భారతీయ చెస్‌ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడు. ఈ ఈవెంట్‌ కోసం గత కొన్ని వారాలుగా రోజుకు 5,6 గంటలు శిక్షణ పొందాడు. చెస్‌ పాఠాలు నేర్పిన రాయ్‌ చెస్‌ అకాడమీకి ధన్యవాదాలు’’ చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News