Saturday, May 3, 2025
HomeఆటGT vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్

GT vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్

ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్(GT), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో గెలిచిన హైదరాబాద్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉంది. ఇక మంచి ఫామ్‌లో ఉన్న గుజరాత్ కూడా గెలిచి తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని చూస్తోంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ 4వ స్థానంలో ఉండగా.. హైదరాబాద్ 9వ స్థానంలో ఉంది.

- Advertisement -

హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్(WK), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(C), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ

గుజరాత్ జట్టు: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(C), జోస్ బట్లర్(WK), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News