HomeTop StoriesCSK vs GT: సీఎస్‌కే చిత్తు.. టాప్‌- 2కి దూసుకెళ్లిన గుజరాత్‌ టైటాన్స్‌ 

CSK vs GT: సీఎస్‌కే చిత్తు.. టాప్‌- 2కి దూసుకెళ్లిన గుజరాత్‌ టైటాన్స్‌ 

CSK vs GT IPL 2026: ఐపీఎల్‌ 2026లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అటు బ్యాటింగ్‌, ఇటు ఫీల్డింగ్‌లో అదరగొట్టిన జీటీ జట్టు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను చిత్తుగా ఓడించింది. 230 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన సీఎస్‌కే.. 13.4 ఓవర్లకే కుప్పకూలింది. దీంతో శుభ్‌మన్‌ గిల్‌ సేన 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో టాప్‌-2 కి ఎగబాకింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/ram-charan-answers-on-his-political-entry/

తొలుత టాస్ గెలిచిన రుతురాజ్‌ గైక్వాడ్‌ బౌలింగ్‌ ఎంచుకోగా.. గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటింగ్‌కి దిగింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ విజృంభణతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. సాయి సుదర్శన్‌ 84(53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభ్‌ మన్‌గిల్‌ 64(37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జాస్‌ బట్లర్‌ 57(27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు నాటౌట్‌) హాఫ్ సెంచరీలతో చెలరేగి ఆడారు. రాహుల్‌ తెవాతియా డకౌట్‌, వాషింగ్టన్‌ సుందర్‌(7) నిరాశ పరిచినా.. ఓపెనర్ల ప్రదర్శనతో జీటీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 229 పరుగుల భారీ స్కోరును చేసింది. సీఎస్‌కే బౌలర్లలో ముఖేష్‌ చౌదరి, జాన్సన్‌, అన్షుల్‌ కాంబోజ్‌ తలో వికెట్‌ తీశారు. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/heavy-rush-in-ttd-due-to-holidays/

భారీ లక్ష్య ఛేదనకి దిగిన చెన్సై సూపర్‌ కింగ్స్‌ ఆరంభం నుంచే వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. శివమ్‌ దూబే 47(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) బౌండరీలతో మ్యాచ్‌ను మలుపు తిప్పే యత్నం చేసినా.. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేరక తప్పలేదు. మట్‌ షార్ట్‌(24), రుతురాజ్‌ గైక్వాడ్‌(16), కార్తీక్‌ శర్మ(19), అన్షుల్‌ కాంబోజ్‌(19) పరుగులు మాత్రమే చేయగలిగారు. సంజూ శాంసన్‌, ఉర్విల్‌ పటేల్‌, స్పెన్సర్‌ జాన్సన్‌ మిగతా బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. గుజరాత్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కోలేక సీఎస్‌కే 140 పరుగులకే చేతులెత్తేసింది. మహ్మద్ సిరాజ్‌, కగిసో రబాడ, రషీద్‌ ఖాన్‌ తలో 3 మూడు వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తాజా మ్యాచ్‌ ఫలితంతో సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ ఆశలు ఆవిరయ్యాయి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News