GT vs RR IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ప్లేయర్లు రాజస్థాన్ రాయల్స్‌పై విరుచుకుపడ్డారు. ఏకంగా 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడమే కాకుండా.. ఆర్‌ఆర్‌ని ఆలౌట్ చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/chandrababu-convoy-stuck-in-hyderabad-traffic/
మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.. గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలతో శుభారంభాన్ని అందించి రాజస్థాన్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచారు. గిల్ 84(44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు, సుదర్శన్ 55(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో చెలరేగి ఆడారు. జాస్ బట్లర్(13), జాసన్ హోల్డర్(7), రాహుల్ తెవాతియా(14) ఫర్వాలేదనిపించారు. వాషింగ్టన్ సుందర్(37) నాటౌట్‌గా నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో బ్రిజేష్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్, జడేజా తలో వికెట్ తీశారు.
Also Read: https://teluguprabha.net/viral/rakhi-sawant-shocking-comments-on-vijay-trisha/
230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపనర్ యశస్వి జైస్వాల్(3) వెంటనే వెనుదిరిగాడు. డ్యాషింగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 36(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు)పరుగులతో పోరాడినా పెవిలియన్ చేరడంతో జట్టు కష్టాల్లో పడింది. ఇక ధ్రువ్ జురెల్(24), రవీంద్ర జడేజా(38), శుభమ్ దూబే(15), దాసున్ శనక(16) గెలుపు దిశగా యత్నించినా.. గుజరాత్ బౌలర్ల ధాటికి తేలిపోయారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో 16.3 ఓవర్లకే 152 పరుగులు చేసి జట్టు ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే నాలుగు కీలక వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. జాసన్ హోల్డర్ 3, రబాడ 2 వికెట్లు తీయగా మహ్మద్ సిరాజ్‌కి ఒక వికెట్ దక్కింది.

