Wednesday, April 2, 2025
HomeఆటGT vs MI: గుజరాత్ గ్రాండ్ విక్టరీ.. ముంబై పై 36 పరుగుల తేడాతో గెలుపు..!

GT vs MI: గుజరాత్ గ్రాండ్ విక్టరీ.. ముంబై పై 36 పరుగుల తేడాతో గెలుపు..!

గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025లో బోణీ కొట్టింది. సమిష్టిగా రాణిస్తూ ముంబై ఇండియన్స్‌పై 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నా, గుజరాత్ బౌలర్ల దాటికి ఎదుర్కోలేక వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది.

- Advertisement -

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తడబడ్డారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (8), ర్యాన్ రికల్టన్ (6) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. సూర్యకుమార్ యాదవ్ (48) తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రయత్నించినా, మిగతా ఆటగాళ్ల నుంచి సహాయం లేకపోవడంతో ముంబై ఓటమిని తప్పించుకోలేకపోయింది.

తిలక్ వర్మ 39 పరుగులు చేసినప్పటికీ, ఇతర బ్యాటర్లు రాణించలేకపోయారు. హార్దిక్ పాండ్యా (11) నిరాశపరిచాడు. చివర్లో రమిన్ ధిర్ (18), మిచెల్ శాంట్నర్ (18) కొంతవరకు ప్రయత్నించినా, అప్పటికే మ్యాచ్ గుజరాత్ చేతిలోకి వెళ్లిపోయింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, కాగిసో రబాడా, సాయి కిషోర్ ఒక్కొక్క వికెట్ తీశారు.

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ కు.. ఓపెనర్లు సాయి సుదర్శన్ (62), శుభమన్ గిల్ (34) అద్భుత ఆరంభం ఇచ్చారు. సుదర్శన్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో మెరిశాడు. జోస్ బట్లర్ 24 బంతుల్లో 39 పరుగులు చేసి స్కోరు బోర్డును సమృద్ధిగా నింపాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్లింది, ముంబై వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితం అయ్యింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News