Friday, November 22, 2024
HomeఆటGundala: వానొస్తే ఆ స్కూల్ పిల్లలకు ఎన్ని కష్టాలో..

Gundala: వానొస్తే ఆ స్కూల్ పిల్లలకు ఎన్ని కష్టాలో..

పాపం స్టూడెంట్స్..

యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని మోడల్ 2013 సంవత్సరంలో ప్రారంభించబడి, ప్రతి విద్యా సంవత్సరంలో పాఠశాల కళాశాల విద్యార్థులను కలుపుకొని సుమారుగా 650 మంది ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. జిల్లాకు మారుమూల ప్రాంతంలో ఉన్న గుండాల మండలంలో పేద మధ్యతరగతి విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉంటారు. అలాంటి విద్యార్థులు మట్టిలో మాణిక్యాల వలె ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నది మండలంలోని వివిధ పాఠశాలలోఎక్కువ గ్రేడింగ్ పాయింట్లు సాధిస్తుంది.

- Advertisement -

చినుకు పడితే చిత్తడే
పాఠశాల నిర్మాణం జరిగిన స్థలం పూర్తిగా చౌడు నేలలు కావడంతో చిన్న వర్షానికి నేను నిలిచిపోవడం జరిగిపోతుంది. ప్రతి సంవత్సరం జూన్ నుంచి మొదలుకొని సెప్టెంబర్ వరకు వర్షాలు కురవడం వల్ల విద్యార్థిని విద్యార్థులు ఆదుకోవడానికి క్రీడాస్థలం ఉన్నప్పటికీ వర్షపు నీరు నిలవడంతో విద్యార్థులు ఆటలకు అంతరాయం కలుగుతూ శారీరక మానసిక ఆనందానికి దూరం అవుతున్నారు.

  • మంచినీళ్ల సమస్య
  • సుమారుగా 650 విద్యార్థిని విద్యార్థులు అభ్యసిస్తున్న పాఠశాల కళాశాలలో మంచినీళ్ల సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది , కొన్ని కొన్ని సార్లు విద్యార్థులు బోరు వాటర్ తాగుతున్నామని చెబుతున్నారు.
  • ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వినతిపత్రం అందజేత ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పాఠశాల ప్రాంగణం రోడ్డు నుండి వెళ్తుండగా పి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తమ మౌలిక వసతులను కల్పించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ మీలాంటి విద్యార్థిని విద్యార్థుల భావితరాల అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని అతి తొందరలో పాఠశాల మౌలిక సదుపాయాలను కల్పిస్తానని విద్యార్థిని విద్యార్థులకు మాట ఇచ్చారు.
  • ఈ కార్యక్రమంలో ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసనపు యాదగిరి గౌడ్, కాంగ్రెస్ నాయకులు, పాఠశాల ప్రిన్సిపా ల్ జి రాము పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News