Sunday, October 6, 2024
HomeఆటGutta Jwala academy: గూత్తా జ్వాల అకాడమీలో మంత్రి

Gutta Jwala academy: గూత్తా జ్వాల అకాడమీలో మంత్రి

సబ్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ - 2023

రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్లోని జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సులో యూనిక్స్ – సన్ రైస్ 35వ సబ్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ – 2023 లో భాగంగా అండర్ 15 అండ్ 17 విభాగాలలో ఈ నెల 14 నుండి 19 వరకు జరిగిన బాలురు, బాలికల ఛాంపియన్షిప్ లో టైటిల్ లను సాధించిన క్రీడాకారులకు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా గారితో కలిసి అందించారు.

- Advertisement -

అనంతరం రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ క్రీడాకారులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడి స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశామని మంత్రి వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలోని విధంగా గ్రామీణ క్రీడాకారులను 17వేల 560 గ్రామాలలో గ్రామీణ క్రీడా మైదానాలను ప్రాంగణాలను నిర్మించామన్నారు రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా స్టేడియాలను నిర్మించామన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం గ్రామ, మండల, జిల్లా స్థాయిలతో పాటు రాష్ట్రస్థాయిలో ఘనంగా నిర్వహించామన్నారు.

సీఎం కప్ ను ప్రతి ఏటా నిరంతరం జరిగేలా కార్యక్రమం రూపొందించామన్నారు. సుమారు 130 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో ఒలంపిక్ పథకాలను సాధించడంలో క్రీడాకారులు మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో బ్యాడ్మింటన్ బాక్సింగ్ షూటింగ్ టేబుల్ టెన్నిస్ వాలీబాల్ హాకీ లాంటి క్రీడలకు హబ్ గా నిలుస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ క్రీడల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు, కోచ్ ల ను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాదులో అతిపెద్ద బ్యాట్మెంటన్ అకాడమీ గా ప్రైవేటు రంగంలో విశిష్ట సేవలను అందిస్తున్న జ్వాలా గుత్తాను ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో క్రాంతి గుత్తా, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ డాక్టర్ రాజేంద్రకుమార్, మహా సిమెంట్ హెడ్ కర్ణాకర్ రావు, మహా సిమెంట్ గ్రూప్ చెందిన నిఖిల్ కృష్ణ పలువురు బ్యాట్మెంటన్ క్రీడాకారులు కోచ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News