ఆటలపై విద్యార్థిని, విద్యార్థులకు మక్కువ కలిగి ఉండాలనీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేట పట్టణంలోని ఆక్స్ ఫర్డ్ మోడల్ స్కూల్ లో SGF (స్కూల్ గేమ్స్ ఫేడరేషన్) ఆధ్వర్యలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు ఆటలు కూడా ఆడితే ఆరోగ్యం మంచిగా ఉంటుందని, రెండింటిలో ఉంటేనే నేటి ప్రపంచంలో ముందుకు వెళ్ళడానికి సులువుగా ఉంటుందనీ సూచించారు.
ఆటల్లో ఆడుతూ అచ్చంపేట ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఈ ప్రాంత క్రీడాకారులు ఆడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి గోవిందారాజులు, జిల్లాలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.