BCCI Elections: బీసీసీఐ అధ్యక్షుడిగా కొత్తవారి ఎంపిక జరగనుంది. రోజర్ బిన్నీ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో అనేది దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో మరో రెండు వారాల్లో భారత క్రికెట్ బోర్డు సర్వసభ్య సమావేశం జరగనుంది. దీంతో ఆ పదవిలోకి మరోసారి మాజీ క్రికెటర్‌కే ఛాన్స్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సచిన్ తెందూల్కర్ పేరు రాగా.. ఆయన టీమ్ ఆ వార్తలను తోసిపుచ్చింది. కాగా.. ఇప్పుడు మాజీ క్రికెటర్లు కిరణ్ మోరె, హర్భజన్ సింగ్ పేర్లు వార్తల్లోకి వచ్చాయి. హర్భజన్ సింగ్‌కు బీసీసీఐ పోస్టు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది క్రికెట్ వర్గాల అంటున్నాయి. దానికి పంజాబ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం కూడా బలం చేకూరుస్తోంది. ఏజీఎంలో తమ ప్రతినిధిగా హర్భజన్‌ను పంజాబ్ నామినేట్ చేసింది. పంజాబ్ తరఫున సర్వసభ్య సమావేశానికి హర్భజన్ హాజరవుతాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా బెంగాల్ క్రికెట్ సంఘం తరఫున ఏజీఎంలో పాల్గొంటాడు.
Read Also: Bigg Boss Captaincy: రెండు గ్రూపులు కొట్టుకుని సంజనాను కెప్టెన్ చేసేశారుగా..!
ఏకగ్రీవంగా అధ్యక్షుడి ఎన్నిక..!
బీసీసీఐ అధ్యక్షుడిని నియమించేందుకు ఎలాంటి ఎన్నికలు నిర్వహించకూడదని బోర్డు భావిస్తోంది. రాష్ట్ర బోర్డులు ఏకగ్రీవంగా అధ్యక్షుడికి మద్దతు తెలిపేలా బీసీసీఐ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే, హర్భజన్, కిరణ్ మోరె పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ హర్భజన్‌సింగ్‌కే బీసీసీఐ అధ్యక్ష పదవి లభిస్తే మరో వరల్డ్ కప్ విజేత జట్టు సభ్యుడికి ఛాన్స్ వచ్చినట్లు అవుతుంది. ఇంతకుముందు గంగూలీ, రోజర్ బిన్నీ కూడా ఇదే కోవలోకి చెందినవారు. హర్భజన్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టీముల్లో సభ్యుడు. అందులోభాగంగా 63 ఏళ్ల భారత మాజీ ఆటగాడు కిరణ్ మోరె కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వెస్ట్ జోన్ నుంచి ఈసారి అధ్యక్షుడిగా అవకాశం దక్కనుంది. కిరణ్ మోరె సౌరాష్ట్రకు చెందిన మాజీ క్రికెటర్. ఆట నుంచి వీడ్కోలు పలికిన తర్వాత సెలక్షన్ కమిటీకి ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. 2019లో యూఎస్‌ఏ క్రికెట్‌కు తాత్కాలిక కోచ్‌గానూ, డైరెక్టర్‌గానూ బాధ్యతలు చేపట్టారు. కాగా.. బోర్డు సమావేశం తర్వాత అధ్యక్షుడు ఎవరనేదానిపై స్పష్టత రానుంది.
Read Also: Bigg Boss Day 5 Updates: కెప్టెన్ మాట వినలేదు కదా.. పర్యావసనాలు ఏంటో చెప్తా.. సంజనా వీర డైలాగులు


