HomeఆటPandya Brothers: అన్నదమ్ములు ఒక్కటయ్యారా?

Pandya Brothers: అన్నదమ్ములు ఒక్కటయ్యారా?

Hardik Pandya: భారత క్రికెట్ జట్టులో మంచి క్రేజ్ ఉన్న అన్నదమ్ముల్లో పాండ్యా బ్రదర్స్‌ ఒకరు.వీరిద్దరూ జంటగా ఎక్కడ కనిపించినా అభిమానులు ఫుల్‌ ఖుష్‌ అవుతారు. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయని అన్నదమ్ములకి మాటల్లేవని రకరకాల రూమర్లు షికారు చేశాయి. అయితే తాజాగా వీరిద్దరూ ముంబై ఎయిర్‌పోర్ట్‌ లో నవ్వుతూ ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

- Advertisement -

వీరిద్దరూ కలిసిపోయారని..

దీంతో ఆ వీడియో చూసిన అభిమానులంతా కూడా వీరిద్దరూ కలిసిపోయారని అనుకుంటున్నారు. అయితే అసలు నిజం ఏంటంటే..ఈ వీడియో పాతది. ఎవరో అభిమాని పాత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాండ్యా బ్రదర్స్‌ మళ్లీ కలిసిపోయారని అంతా అనుకుంటున్నారు.

Also Read:Boxing Final: బాక్సింగ్‌ లో బంగారాన్ని ముద్దాడిన ప్రీతి

కొంతకాలం క్రితం టీమిండియా టీ20 ప్రపంచకప్‌ విన్‌ అయిన టైమ్‌ లో కృణాల్‌..హార్ధిక్‌ కి కనీసం విష్‌ చేయకపోవడంతో వీరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు బయటకి వచ్చాయి. హార్దిక్ పాండ్యా, నటాషా స్టాన్‌కోవిచ్ విడాకుల విషయంలో కుటుంబంలో వచ్చిన విభేదాలే దీనికి కారణమని కొన్ని కథనాలు పేర్కొన్నాయి.

ఐపీఎల్‌ 2026 సీజన్‌ టైమ్‌ లో కృణాల్‌ ఆర్సీబీ ఫ్రాంచైజీ విడుదల చేసిన ఒక వీడియోలో గొడవల గురించి పరోక్షంగా స్పందించాడు. నేను నా సోదరుడితో మ్యాచ్‌ ఆడబోతున్నాను,అంతమాత్రాన మా మధ్య ఉన్న బంధం ఏదీ మారదు. మేమిద్దరం మైదానంలో ఉన్నప్పడు పోటీదారులమే అంటూ చెప్పుకొచ్చాడు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News