Friday, September 20, 2024
HomeఆటHardik Pandya : వాళ్ల‌ను ఎందుకు ఆడించ‌లేదు.. హార్ధిక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. నెటీజ‌న్ల ఫైర్‌

Hardik Pandya : వాళ్ల‌ను ఎందుకు ఆడించ‌లేదు.. హార్ధిక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. నెటీజ‌న్ల ఫైర్‌

Hardik Pandya : న్యూజిలాండ్‌పై టీమ్ఇండియా టీ20 సిరీస్‌ను 1-0 తేడాతో గెలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే.. తుది జ‌ట్టులో సంజు శాంస‌న్‌, ఉమ్రాక్ ల‌కు ఎందుకు చోటి ఇవ్వ‌లేదు అన్న విష‌యంపై అభిమానులు ప్ర‌స్తుతం మండిప‌డుతున్నారు.

- Advertisement -

వీరిద్ద‌రికి ఎందుకు చోటి ఇవ్వ‌లేదు అన్న విష‌యంపై హార్ధిక్ పాండ్య షాకింగ్ కామెంట్లు చేశాడు.”ముందుగా అంద‌రికి ఓ విష‌యం స్ప‌ష్టం చేయాల‌ని అనుకుంటున్నా. బ‌య‌ట జ‌ట్టు గురించి చాలా మంది చాలా ర‌కాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాట‌లు మాపై ఎలాంటి ప్ర‌భావం చూప‌వు. ఇది నా జ‌ట్టు. హెడ్ కోచ్‌తో చ‌ర్చించిన త‌రువాతే అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌ను తీసుకుంటా. ఆ విధంగానే ప్రణాళిక‌లు, జ‌ట్టు వ్యూహాలు సిద్దం చేసుకుంటాం. ఇంకా స‌మ‌యం చాలా ఉంది. ప్ర‌తి ఒక్క‌రికి ఎప్పుడో ఒక‌సారి అవ‌కాశం వ‌స్తుంది. ఆడాల్సిన సిరీస్‌లు చాలా ఉన్నాయి. ఈ సిరీస్ చాలా చిన్న‌ది. ఇంకా మ్యాచ్‌లు ఉంటే త‌ప్ప‌కుండా అంద‌రిని ఆడించే ప్ర‌య‌త్నం చేసేవాళ్లం” అని హార్థిక్ అన్నాడు.

నెటీజ‌న్ల ఆగ్ర‌హాం..

హార్దిక్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు. కెప్టెన్ కాగానే హార్ధిక్‌కు పొగ‌రు ఎక్కువైంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఐదు మ్యాచ్‌లకే ఇంత యాటిట్యూడ్ చూపిస్తే చాలా క‌ష్ట‌మ‌ని, మున్ముందు టీమ్ఇండియా కెప్టెన్‌గా కొన‌సాగాలంటే ఒదిగి ఉండ‌డం చాలా ముఖ్య‌మ‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. పూర్తి స్థాయి కెప్టెన్ కాకముందే హార్దిక్ పాండ్యా ఇంత అహంకారపూరితంగా మాట్లాడుతుంటే భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటాడోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News