Hardik Pandya rumoured girlfriend: టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2025లో ఆటతోపాటు కొత్త హెయిర్ స్టైల్ తోనూ ఆకట్టుకున్నాడు పాండ్యా. ఇప్పుడు తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ తో కనిపించి అందరికీ షాకిచ్చాడు. ఈ స్టార్ ఆల్ రౌండర్ ఇటీవల రూ.4.5 కోట్లు (US$1.2 మిలియన్లు) పెట్టి కొత్త లంబోర్గిని కొనుగోలు చేశాడు. అదే కారులో తన కొత్త స్నేహితురాలిని రైడ్ కి తీసుకెళ్తున్నట్లు కనిపించాడు. హార్దిక్ పాండ్యా కొత్త స్నేహితురాలు ఎవరనీ సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు హార్దిక్ ఫ్యాన్స్. వీరిద్దరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
హార్దిక్ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరు?
హార్దిక్ పాండ్యా రూమర్ గర్ల్ ఫ్రెండ్ పేరు మహికా శర్మ. ఈమె ఢిల్లీకి చెందిన భామ. ఈ ముద్దుగుమ్మ ఎన్నో కోట్లకు అధిపతిని తెలుస్తోంది. వృత్తిరీత్యా మోడల్ అయిన మహికా శర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహికా ఢిల్లీలో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆ తర్వాత ఆర్థిక శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేసింది. హార్దిక్, మహికా కలిసి తిరగడం కొత్తేమీ కాదు. గతంలో కూడా వీరిద్దరూ బయట జంటగా కనిపించారు. మళ్లీ ఇప్పుడు రైడ్ కు వెళ్లూ కెమెరాకు చిక్కారు. ఈ వీడియో ఒక ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చింది. మహికా శర్మ నికర ఆస్తుల విలువ రూ. 3.2 కోట్లు (US$3.2 మిలియన్లు) అని తెలుస్తోంది. మహికా కంటే ముందు నటాషా పాండ్యా బ్రిటిష్ గాయని జాస్మిన్ వాలియాతో కనిపించాడు.
పాండ్యా ఆస్తులు విలువెంతో తెలుసా?
హార్దిక్ పాండ్యాకు దాదాపు వంద కోట్లు వరకు ఆస్తులు ఉంటాయి. స్టైల్ కు పెట్టింది పేరు పాండ్యా. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ సెన్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. తరుచూ లగ్జరీ వాచెస్, ట్రెండీ దుస్తులు ధరిస్తూ ట్రెండ్ సెట్ చేస్తాడు. హార్దిక్ దగ్గర భారీ కార్ల కలెక్షన్ కూడా ఉంది. రోల్స్ రాయిస్, మెర్సిడెస్ మరియు రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు ఇతడి గ్యారేజ్ లో ఉన్నాయి. క్రికెటర్ గానే కాదు పలు యాడ్స్ ద్వారా కూడా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ ఏడాదికి రూ. 16.35 కోట్లు తీసుకుంటున్నాడు. బీసీసీఐ గ్రేడ్ ఏ సెంట్రల్ కాంట్రాక్టుతో ఏడాదికి రూ.5 కోట్లు లభిస్తాయి. టెస్టులు, వన్డేలు, టీ20 మ్యాచ్ లకు ఫీజులు అదనం. 2025 నాటికి పాండ్యా నికర ఆస్తుల విలువ రూ. 91-98 కోట్లు మధ్య ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


