HomeఆటHarmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై..

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై..

ముంబై, అక్టోబర్ 6 (తెలుగు ప్రభ): భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ నిర్ణయంతో 2016లో ప్రారంభమైన కెప్టెన్సీ ప్రస్థానానికి ముగింపు పలికారు. అయితే క్రికెటర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగించనున్నట్లు హర్మన్‌ప్రీత్ స్పష్టం చేశారు.

- Advertisement -

సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు ద్వారా హర్మన్‌ప్రీత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అంత సులభమైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. జట్టు కోసం తన రక్తం, చెమట, సమయం, వ్యక్తిగత ఆశయాలను సైతం త్యాగం చేశానని తెలిపారు. కెప్టెన్‌గా ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నానని, వాటి వెనుక జట్టును మెరుగుపరచాలనే ఉద్దేశం మాత్రమే ఉందన్నారు. జట్టు ప్రస్తుతం ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో మంచి స్థితిలో ఉందని చెప్పుకొచ్చారు. కెప్టెన్సీ ముగిసినా భారత క్రికెట్‌పై తన ప్రేమ ఎప్పటికీ కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఇకపై ఆటపై మరింత దృష్టి సారించి క్రికెటర్‌గా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

కాగా, హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో భారత మహిళల జట్టు కీలక విజయాలు సాధించింది. చారిత్రాత్మక ప్రపంచకప్ విజయం, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం వంటి ఘనతలు ఆమె కెప్టెన్సీ కాలంలో నమోదయ్యాయి. మరోవైపు, సుదీర్ఘకాలం వైస్ కెప్టెన్‌గా ఉన్న స్మృతి మంధానకు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News