Tuesday, February 18, 2025
HomeఆటAustralia Women tour of India: ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టు...

Australia Women tour of India: ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టు ఇదే.. స్టార్ ఆల్‌రౌండ‌ర్ దూరం

Australia Women tour of India : ఆస్ట్రేలియాతో స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టును భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఎంపిక చేసింది. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలో 15 మందితో కూడిన జ‌ట్టును సెల‌క్ట‌ర్లు ప్ర‌క‌టించారు. గాయం కార‌ణంగా స్టార్ ఆల్‌రౌండ‌ర్ పూజా వ‌స్త్రాక‌ర్ ఈ సిరీస్‌కు దూరం అయ్యింది. ఆంధ్రా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అంజలి శర్వాని జాతీయ జ‌ట్టుకు ఎంపికైంది.

- Advertisement -

25 ఏళ్ల ఆంధ్రా లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ అంజలి గత నెల ప్రారంభంలో జరిగిన ఉమెన్స్ ఛాలెంజర్‌లో పూనమ్ యాదవ్ నేతృత్వంలోని ఇండియా ఎ త‌రుపున చ‌క్క‌టి ప్ర‌ద‌ర్శ‌న చేసింది. నాలుగు మ్యాచ్‌ల్లో 5.50 ఎకాన‌మీతో మూడు వికెట్లు పడ‌గొట్టింది. ఈ సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుండగా, స్మృతి మంధాన ఆమెకు డిప్యూటీగా ఎంపికైంది.

ముంబై వేదిక‌గా డిసెంబ‌ర్ 9న టీ20 సిరీస్ ఆరంభం కానుంది. 11,14,17, 20 తేదీల్లో మిగిలిన మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీప‌ర్‌), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి, అంజలి వైద్య, ఎస్ మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News