Saturday, November 15, 2025
HomeఆటHarmanpreet Youth Advice : “కలలు కనండి, నమ్మండి, అవే నిజమవుతాయి!” - యువతకు హర్మన్‌ప్రీత్...

Harmanpreet Youth Advice : “కలలు కనండి, నమ్మండి, అవే నిజమవుతాయి!” – యువతకు హర్మన్‌ప్రీత్ సందేశం

Harmanpreet Speech : టీమ్ ఇండియా మహిళల వన్డే వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుని దశాబ్దాల కలను సాకారం చేసుకుంది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ నేపథ్యంలో టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ యువతకు చక్కటి సందేశం ఇచ్చారు.

- Advertisement -

ALSO READ: YS Jagan Krishna Visit : కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన.. పంట నష్టం “ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా ఎక్కడ?”

టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ BCCI విడుదల చేసిన వీడియోలో “కలలు కనడం ఎప్పుడూ ఆపొద్దు” అని సలహా ఇచ్చారు. తన చిన్నప్పటి విషయాలతో పాటు, 2017 ప్రపంచకప్ ఓటమి నుంచి విజయం వరకు ప్రయాణాన్ని పంచుకున్నారు. “భారత అభిమానుల ప్రార్థనలు, ఆశీర్వాదాలే మాకు శక్తి” అంటూ తెలిపారు.

హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ, “నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చేతిలో బ్యాట్ ఉండేది. అది నాన్న క్రికెట్ కిట్‌లోది. చాలా పెద్దగా ఉండేది. ఒకరోజు నాన్న పాత బ్యాట్‌ను చిన్నగా చెక్కి ఇచ్చాడు. మేం దానితో ఆడుకునేవాళ్లం. టీవీలో టీమ్ ఇండియా మ్యాచ్‌లు చూస్తుంటే, నాకు కూడా ఇలాంటి అవకాశం రావాలని కలలు కనేదాన్ని. అప్పట్లో మహిళల క్రికెట్ గురించి తెలియదు. కానీ క్రికెట్ ఆడాలని ఆశగా ఉండేది. అదే జరిగింది. ఇప్పుడు ప్రపంచకప్ కూడా సాధించాం” అని తెలిపారు.

2017 ప్రపంచకప్ ఫైనల్‌లో 9 పరుగుల తేడాతో ఓటమి తర్వాత భారత అభిమానుల నుంచి మళ్లీ లభించిన స్వాగతం, ప్రోత్సాహం వల్లే నేడు ఇండియా మళ్లీ గెలిచిందని హర్మన్‌ప్రీత్ తెలిపారు “అందరి ప్రార్థనలు, ఆశీర్వాదాలే మాకు శక్తి, ఆ దేవుడికి కృతజ్ఞతలు” అని చెప్పారు.
హర్మన్‌ప్రీత్ కౌర్ 2017లో భారత్ కెప్టెన్‌గా మారారు. 150+ వన్డేలు, 100+ టీ20లు ఆడారు. 2025 వరల్డ్ కప్ విజయం తో మహిళల క్రికెట్‌లో చెరగని ముద్ర వేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad