Thursday, April 3, 2025
HomeఆటEngland tour of Pakistan 2022 : పాక్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌కు భారీ...

England tour of Pakistan 2022 : పాక్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్‌

England tour of Pakistan 2022 : 17 ఏళ్ల సుదీర్ఘ విరామం త‌రువాత పాకిస్తాన్ గ‌డ్డ‌పై అడుగుపెట్టింది ఇంగ్లాండ్‌. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఇంగ్లాండ్ జ‌ట్టు మూడు టెస్టులు ఆడ‌నుంది. అయితే.. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఇంగ్లాండ్ జ‌ట్టుకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ మార్క్‌వుడ్ గాయం కార‌ణంగా తొలి టెస్టుకు దూరం అయ్యాడు. రావ‌ల్పిండి వేదిక‌గా పాకిస్తాన్‌తో ఇంగ్లాండ్ జ‌ట్టు డిసెంబ‌ర్ 1న తొలి టెస్టు ఆడ‌నుంది.

- Advertisement -

ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో తుంటి గాయం బారిన ప‌డిన వుడ్ ఇంకా ఆ గాయం నుంచి కోలుకోలేద‌ని ఇంగ్లాండ్ హెచ్ కోచ్ బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ తెలిపాడు. దీంతో తొలి టెస్టుకు దూరం అయ్యాడ‌ని, రెండో టెస్టు కల్లా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మెక్‌క‌ల్ల‌మ్ ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు.

ఇక ఇప్ప‌టికే వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఈ టెస్ట్ సిరీస్‌కు మ‌రో సీనియ‌ర్ ఫాస్ట్ బౌల‌ర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ దూరంగా ఉన్నాడు. ఇటీవ‌లే బ్రాండ్ తండ్రైన విష‌యం తెలిసిందే. త‌న చిన్నారితో స‌మ‌యాన్ని గ‌డిపేందుకు బ్రాడ్ పాక్ ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉన్నాడు.

ఇంగ్లాండ్ జ‌ట్టు..

బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్ (వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, కీటన్ జెన్నింగ్స్, జాక్ లీచ్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్‌టన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్ , రెహాన్ అహ్మద్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News