Gautam Gambhir: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచిన తరుణంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందించారు. ఈ చారిత్రాత్మక ట్రోఫీని భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితమిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ద్రవిడ్, లక్ష్మణ్‌ల కృషి వెలకట్టలేనిది!: భారత క్రికెట్ జట్టు ప్రస్తుత స్థాయికి చేరడంలో ద్రవిడ్, లక్ష్మణ్‌ల పాత్ర ఎంతో ఉందని గంభీర్ కొనియాడారు. వారిద్దరూ వేసిన పునాది వల్లే ఈరోజు భారత్ ప్రపంచకప్‌ను గెలుచుకోగలిగిందని అన్నారు. అందుకే ఈ విజయాన్ని వారికి అంకితం ఇస్తున్నానని పేర్కొన్నారు.
Also read-T20 World Cup: మిడిలార్డర్ వెన్నెముక తిలక్.. అంకితభావానికి నిదర్శనం సిరాజ్!
సోషల్ మీడియా ట్రోల్స్‌పై వ్యాఖ్యలు: ఇదే సమయంలో సోషల్ మీడియాలో తనపై వచ్చే విమర్శలకు గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. “నేను సోషల్ మీడియాలో ఉండే వ్యక్తులకు జవాబుదారీని కాదు. నా బాధ్యత కేవలం నా జట్టుకు మాత్రమే. టీమ్ ఇండియా ప్రయోజనాలే నాకు ముఖ్యం” అని గంభీర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా ఊహాగానాల కంటే మైదానంలో జట్టు ప్రదర్శనే తనకు ప్రాధాన్యమని అన్నారు. గంభీర్ కోచింగ్‌లో భారత్ ఐసీసీ ట్రోఫీ సాధించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

