Saturday, November 15, 2025
HomeఆటHeinrich Klaasen: షాకింగ్.. కాటేరమ్మ కొడుకు రిటైర్మెంట్

Heinrich Klaasen: షాకింగ్.. కాటేరమ్మ కొడుకు రిటైర్మెంట్

సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు, డేంజర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klaasen ) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 33 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్లాసెన్ నిర్ణయంతో అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా షాక్ అవుతున్నారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం షాకింగ్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

దక్షిణాఫ్రికా తరఫున 60 వన్డేలు ఆడిన క్లాసెన్ .. 2141 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు బాదాడు. ఇక 58 టీ20లు, నాలుగు టెస్టులు మాత్రమే ఆడాడు. మొత్తంగా తన కెరీర్‌లో 3,245 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్లాసెన్.. కాటేరమ్మ కొడుకుగా పాపులర్ అయ్యాడు. కాగా ఇప్పటికే వన్డేలకు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మాక్స్‌వెల్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా క్లాసెన్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad