Thursday, March 12, 2026
HomeఆటTeam India: టీమిండియాను వణికిస్తున్న వైరల్ ఫీవర్..మెున్న బుమ్రా.. నేడు అభిషేక్!

Team India: టీమిండియాను వణికిస్తున్న వైరల్ ఫీవర్..మెున్న బుమ్రా.. నేడు అభిషేక్!

High fever for Jasprit Bumrah and Abhishek Sharma: టీ20 ప్రపంచకప్‌లో అమెరికాపై ఘనవిజయం సాధించి జోరు మీదున్న టీమిండియాను ఇప్పుడు ఆటగాళ్ల గాయాలు, అనారోగ్యం కలవరపెడుతున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం బారిన పడగా.. మరోవైపు జట్టులోకి స్టార్ ఆల్‌రౌండర్ రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మేరకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక అప్‌డేట్స్ ఇచ్చాడు.

- Advertisement -

బుమ్రాకు హై ఫీవర్.. అభిషేక్ కు సైతం!
అమెరికాతో జరిగిన మ్యాచ్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంపై సూర్య క్లారిటీ ఇచ్చాడు. స్టార్ పేసర్ బుమ్రా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడని, అందుకే అతను ఈ మ్యాచ్ ఆడలేదని సూర్య తెలిపాడు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా అస్వస్థతకు గురయ్యాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అతను బ్యాటింగ్ చేసినప్పటికీ, ఫీల్డింగ్ చేయలేకపోయాడు. అతని స్థానంలో సంజూ శాంసన్ చాలా సేపు ఫీల్డింగ్ బాధ్యతలు నిర్వహించాడు.

సుందర్ రీఎంట్రీ..
గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పక్కటెముకల గాయంతో బాధపడిన సుందర్, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకున్నాడు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరిగే మ్యాచ్ కోసం సుందర్ నేరుగా ఢిల్లీలో జట్టుతో కలవనున్నట్లు కెప్టెన్ ధృవీకరించాడు. సుందర్ రాకతో టీమిండియా స్పిన్ విభాగం మరింత బలోపేతం కానుంది.

Also Read: Team India -చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు..

హర్షిత్ రాణా దూరం..
ఇప్పటికే మోకాలి గాయంతో యువ పేసర్ హర్షిత్ రాణా టోర్నీ మొత్తానికి దూరమవ్వడం టీమిండియాకు పెద్ద దెబ్బ. అతను కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. బుమ్రా త్వరగా కోలుకోవాలని, లేదంటే కీలకమైన పాకిస్థాన్ మ్యాచ్‌లో ఇబ్బందులు తప్పవని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News