Saturday, February 1, 2025
HomeఆటVirat Kohli: రోజుకు కోహ్లీ పారితోషికం ఎంతో తెలుసా..?

Virat Kohli: రోజుకు కోహ్లీ పారితోషికం ఎంతో తెలుసా..?

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత రంజీ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. రైల్వేస్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరపపున బరిలో దిగాడు. దీంతో ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అయితే ఈ మ్యాచులో కేవలం 6 పరుగులకే కోహ్లీ ఔట్ కావడం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ మిగిలిన ఆటగాళ్లు అద్భుతంగా ఆడటంతో ఢిల్లీ జ‌ట్టు రైల్వేస్‌ను ఇన్నింగ్స్ 19 ప‌రుగుల తేడాతో ఓడించింది.

- Advertisement -

మరోవైపు జియో సినిమాస్‌లో ఈ మ్యాచ్‌కు రికార్డ్ స్థాయిలో వ్యూయర్ షిప్ వస్తుంది. కేవలం కోహ్లీ ఈ మ్యాచ్ ఆడుతుండటం వల్లే ఇంత వ్యూయర్ షిప్ రావడం విశేషం. దీంతో కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌ ఆడినందుకు కోహ్లీకి ఎంత పారితోషికం వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రోజుకు రూ.60వేలు చొప్పున నాలుగు రోజులకు రూ.2.40 లక్షలు పారితోషికం లభించింది.

కాగా ఏ ఆటగాడైనా రంజీల్లో 40 మ్యాచుల‌కు పైగా ఆడితే రోజుకు రూ.60వేలు జీతంగా అందుకుంటాడు. ఇక 21 నుంచి 40 మ్యాచ్‌లు ఆడితే రూ. 50 వేలు, 20 మ్యాచ్‌ల కంటే త‌క్కువ ఆడితే రూ. 40వేలు, అరంగేట్ర ఆట‌గాడికైతే రూ.20 వేల నుంచి రూ. 30వేల వ‌ర‌కు ఇస్తారు. అయితే కోహ్లీ కేవలం ఇప్పటివరకు 23 రంజీ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ 141 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడటంతో అతడికి రూ.60వేల లెక్కన ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News