HomeఆటBCCI: భారత జట్టుకు భారీ రివార్డు.. రూ. 131 కోట్లతో సత్కరించనున్న బీసీసీఐ!

BCCI: భారత జట్టుకు భారీ రివార్డు.. రూ. 131 కోట్లతో సత్కరించనున్న బీసీసీఐ!

Indian Cricket team: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచిన క్రికెట్ జట్టుకు బీసీసీఐ (BCCI) భారీ నజరానా ప్రకటించింది. దేశానికి గర్వకారణంగా నిలిచిన టీమ్ ఇండియా ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ మరియు సహాయక సిబ్బందికి కలిపి రూ. 131 కోట్ల రివార్డును అందజేయనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

- Advertisement -

బీసీసీఐ ప్రశంసల జల్లు: భారత జట్టు అద్భుత ప్రదర్శనపై బీసీసీఐ హర్షం వ్యక్తం చేసింది. ఆటగాళ్ల కృషి, సహాయక సిబ్బంది వ్యూహాలు మరియు సెలక్టర్ల సరైన ఎంపిక వల్లే ఈ ఘనత సాధ్యమైందని కొనియాడింది. ఈ విజయం భారత క్రికెట్ స్థాయిని ప్రపంచ వేదికపై మరో మెట్టు పైకి తీసుకెళ్లిందని బోర్డు ప్రతినిధులు పేర్కొన్నారు. త్వరలోనే ఆటగాళ్లకు ఈ నగదు పురస్కారాన్ని అందజేయడానికి ప్రత్యేక సత్కార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.

Also read-T20 World Cup: ఈ విజయం ఆ ఇద్దరికి అంకితం.. గౌతమ్ గంభీర్ భావోద్వేగ వ్యాఖ్యలు!

సొంతగడ్డపై సరికొత్త రికార్డు: రెండు రోజుల క్రితం జరిగిన ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ విజయంతో టీమ్ ఇండియా పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. మొత్తంగా టీ20 ఫార్మాట్‌లో భారత్‌కు ఇది మూడవ ప్రపంచకప్ కావడం విశేషం. ఆతిథ్య దేశం విశ్వవిజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News