HomeTop StoriesIPL 2026: ఉప్పల్‌ స్టేడియంలో చితక్కొట్టిన సన్‌రైజర్స్‌.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్‌ ఫిక్స్‌..!

IPL 2026: ఉప్పల్‌ స్టేడియంలో చితక్కొట్టిన సన్‌రైజర్స్‌.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్‌ ఫిక్స్‌..!

Huge target for RCB against SRH: ఐపీఎల్‌ 2026లో భాగంగా ఉప్పల్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఉత్కంఠభరితంగా సాగుతోన్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి రాయల్‌ ఛాలెంజర్స్‌ ముందు భారీ టార్గెట్‌ ఫిక్స్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ ఒకరకంగా విధ్వంసం సృష్టించిందనే చెప్పవచ్చు. ఇషాన్‌ కిషన్‌ 79 (46 బంతుల్లో, 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ 56 (22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), క్లాసెన్‌ 51 రన్స్‌ (24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు)లతో చెలరేగిపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ట్రావిస్‌ హెడ్‌ 26 (16 బంతుల్లో), నితీశ్‌ రెడ్డి 29* (12 బంతుల్లో – నాటౌట్‌) పరుగులు చేశారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్లలో సలామ్‌ దార్‌ 2 వికెట్లు, సుయాష్‌ శర్మ, కృనాల్‌ పాండ్య చెరో వికెట్‌ తీశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నెలకొల్పిన ఈ భారీ టార్గెట్‌ను ఆర్సీబీ ఛేదిస్తుందా? లేదా అనేది మరి కాసేపట్లో తేలనుంది.

- Advertisement -

Also read: Vamsi Mohan arrest: మల్కాజిగిరి డిప్యూటీ కలెక్టర్‌ అరెస్ట్‌.. ఏసీబీ తనిఖీల్లో సంచలన విషయాలు వెల్లడి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News