Sunday, September 8, 2024
HomeఆటHyd: కార్పొరేటర్ల స్పోర్ట్స్ మీట్

Hyd: కార్పొరేటర్ల స్పోర్ట్స్ మీట్

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఈనెల 23, 24, 25 తేదీలలో నిర్వహించిన కార్పొరేటర్ల స్పోర్ట్స్ మీట్ ముగిసింది. వివిధ క్రీడల్లో పాల్గొన్న కార్పొరేటర్లు పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. 

- Advertisement -

నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి పి.జె.ఆర్ విక్టరీ ఇండోర్ స్టేడియంలో ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని గెలుపొందిన కార్పొరేటర్లకు షీల్డ్ లను అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ… కార్పొరేటర్లు నిత్యం ప్రజా సమస్యలు, అభివృద్ధి సంక్షేమంపై తీరిక లేకుండా విశేష కృషి చేస్తున్నారని, వారికి మానసిక ఉల్లాసం కోసం జిహెచ్ఎంసి ఏర్పాటుచేసిన ఈ క్రీడా పోటీలు సందడిగా మారింది. అందుకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జిహెచ్ఎంసి కమిషనర్, క్రీడా విభాగం అధికారులతో పాటు పాల్గొన్న కార్పొరేటర్లకు  పోటీల్లో గెలుపొందిన కార్పొరేటర్ల కు అభినందనలు తెలిపారు. మహిళా విభాగంలో చెస్ లో శ్రీలత శోభన్ రెడ్డి, ప్రథమ బహుమతి గెలుపొందారు.  బొంతు శ్రీదేవి బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, మ్యూజిక్ చైర్  క్రీడా పోటీలలో అన్నింటిలోను ప్రథమ బహుమతి గెలుపొందినారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి, స్పోర్ట్స్ డైరెక్టర్ భాష, డి సి లు,  ఫిజికల్ డైరెక్టర్ మాధవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News