Saturday, November 23, 2024
HomeఆటHyd: బల్దియా సమ్మర్ క్యాంప్స్ లో చేరండి

Hyd: బల్దియా సమ్మర్ క్యాంప్స్ లో చేరండి

జిహెచ్ఎంసి నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపులు, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రోత్సహించాలని, క్రీడల వల్ల ఆరోగ్యము మరియు మానసిక వికాసము వృద్ధి చెందుతుందని ప్రభుత్వ whip అరికెపూడి గాంధీ సూచించారు. జిహెచ్ఎంసి ప్లే గ్రౌండ్ నందు PV సింధు , పుల్లెల గోపీచంద్, నిక్కత్ జరీన్, సానియా మీర్జాలు అంతర్జాతీయ స్థాయిలో రాణించారన్నారు.

- Advertisement -

జిహెచ్ఎంసి కూకట్పల్లి జోన్, శేర్లింగంపల్లి జోన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ పి జె ఆర్ చందానగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం నందు శేర్లింగంపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ మంజుల , మాదాపూర్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ప్రారంభించారు. జోనల్ కమిషనర్ శంకరయ్య, చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుదాంషు ,శేర్లింగంపల్లి డిప్యూటీ కమిషనర్ వెంకన్న పాల్గొన్నారు.
జిహెచ్ఎంసి 1968లో మొదటిసారిగా దేశంలోనే 10 సెంటర్లలో 1200 బాలురకు, 200 మంది బాలికలకు శిక్షణ అందించింది. గత 55 సంవత్సరాలు నుండి నిరంతరాయంగా శిక్షణ అందిస్తుంది. 6 నుండి 16 సంవత్సరాల పిల్లలకు శిక్షణను ప్లేగ్రౌండ్స్ మరియు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లలో నిర్వహిస్తున్నది. శేర్లింగంపల్లి జోన్ లోని 46 ప్లే గ్రౌండ్స్, ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు 2414 మందికి శిక్షణ అందిస్తున్నారు. యూసఫ్ గూడా లోని 19 సెంటర్లలో ఎనిమిది గేమ్స్నో, షేర్ లింగంపల్లి మూడు సెంటర్లలో మూడు గేమ్స్ను చందానగర్ 17 సెంటర్లలో 14 గేమ్స్ రామచంద్రపురం మరియు పటాన్చెరులో 8 సెంటర్లలో ఆరు గేమ్స్ 47 మంది కోచస్ 47 ప్లేగ్రౌండ్స్ మరియు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నాలుగు సర్కిలలో నిర్వహిస్తున్నారు. కూకట్పల్లి జోన్ లోని మూసాపేట్ 31 సెంటర్లు 8 గేమ్స్, కూకట్పల్లి ఐదు సెంటర్లలో మూడు గేమ్స్, కుత్బుల్లాపూర్ 18 సెంటర్లు 9 గేమ్స్ గాజులరామారంలో 22 సెంటర్లలో 11 గేమ్స్, అల్వాల్ తొమ్మిది సెంటర్లోన 7 గేమ్స్ 85 మంది కోచ్ల ఆధ్వర్యంలో ఐదు సర్కిలలో 45 జిహెచ్ఎంసి ప్లేగ్రౌండ్లలో సమ్మర్ కోచింగ్ క్యాంప్లెను నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో NCC,అథ్లెటిక్స్ ,బాల్బ్యాడ్మింటన్ ,బాస్కెట్బాల్ ,బాక్సింగ్ ,క్రికెట్, చెస్, క్యారమ్స్ , ఫుట్బాల్, టైక్వాండో, వాలీబాల్, యోగ, కరాటే మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. మార్చ్ ఫాస్ట్ లో మొదటి ప్రైజ్ PJR స్టేడియం రవి ,శ్రీకాంత్ టైక్వాండో, జిమ్నాస్టిక్స్ వెంకటేష్ కన్సోలేషన్ స్కేటింగ్ మరియు NCC పొందారు. స్కేటింగ్లో జాతీయస్థాయిలో ఐదో ర్యాంక్ గెలుపొందిన చిన్నారిని ప్రభుత్వ విప్ అభినందించారు. కోచులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు. గెలుపొందిన వారికి మెమొంటోలు అందజేశారు. వ్యాఖ్యాత మల్లేష్, గేమ్స్ ఇన్స్పెక్టర్ వీరానంద్, కోచస్ అంజిబాబు, సురేష్, హేమంత్ ,వెంకట్రావు భాష ,రాజశేఖర్, రవీంద్ర చేతన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News