Tuesday, October 8, 2024
HomeఆటHyd: పడిగ తేజస్ ముదిరాజ్ కు అభినందనలు

Hyd: పడిగ తేజస్ ముదిరాజ్ కు అభినందనలు

ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ లో సత్తా

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ పడిగ తేజస్ ముదిరాజ్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డా. బండా ప్రకాష్ ముదిరాజ్ అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను సాదించాలని ఆకాక్షించారు. యువత క్రీడల్లో ముందుండాలని సూచించారు.

- Advertisement -


చైనాలోని బీజింగ్ లో జరిగిన 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ లో 16 సంవత్సరాల వయస్సులోనే పడిగ తేజస్ ముదిరాజ్ సత్తా చాట్టడం అభినందనీయం అన్నారు. ముదిరాజ్ బిడ్డ కావడం గర్వకారణమని చెప్పారు. ఈనెల 18 నుంచి 28వ తేదీ వరకు జరిగిన పోటీలలో హైదరాబాద్ కి చెందిన పడిగ తేజస్ ముదిరాజ్ సిల్వర్ మెడల్ సాధించి తన సత్తా చాటాడు.


పడిగ తేజస్ ఇప్పటికే జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో పలు మెడల్స్ సాధించాడు. 79 బంగారు పథకాలు 33 వెండి పథకాలు సాధించి అబ్బుర పరిచాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News