Sunday, July 7, 2024
HomeఆటHyd: పోలీస్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన అడివి శేష్

Hyd: పోలీస్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన అడివి శేష్

హైదరాబాద్ సిటీ పోలీస్ స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. గోషామహల్ లోని శివకుమార్ లాల్ పోలీస్ స్టేడియం ఈ భారీ ఈవెంటుకు వేదికైంది. నాలుగు రోజులపాటు జరగనున్న స్పోర్ట్స్ మీట్ ను ప్రముఖ నటుడు అడివి శేష్, హైదరాబాద్ సీపీ ఆనంద్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు పోలీసు సిబ్బందితో సరదాగా గడిపారు. బాస్కెట్ బాల్, వాలీబాల్, కబాడ్డీ ఆడి ఔత్సాహికులకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. స్పోర్ట్స్ మీట్ లో భాగంగా అథ్లెటిక్స్, ఫుట్ బాల్, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, రన్నింగ్ వంటి క్రీడా పోటీలు ఉంటాయని అన్నారు. ముంబై తాజ్ హోటల్ దాడుల్లో అమరులైన మేజర్ ఉన్నికృష్ణన్ ను స్మరించుకున్నారు. ఆయన చేసిన త్యాగం దేశంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడిందని గుర్తు చేసుకున్నారు.
స్పోర్ట్స్ మీట్ లో సీపీ ఆనంద్ మాట్లాడుతూ పోలీసులు ఫిట్నెస్ పై శ్రద్ధ వహించాలన్నారు. విధి నిర్వహణలో శారీరక, మానసిక బలం రెండు అవసరమని పేర్కొన్నారు. ఫిట్ కాప్ యాప్ ద్వారా బీపీ, షుగర్ తదితర ఆరోగ్య అంశాలను గమనించామన్నారు. ఫిట్ కాప్ యాప్ ను వినియోగించాలని సూచించారు. ఆరోగ్య సంరక్షణ, డైట్, వ్యాయామం, కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. స్పోర్ట్స్ మీట్ లో ప్రతిభ కనబరచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలు, జాతీయ స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లకు పంపిస్తామని ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News