Friday, July 5, 2024
HomeఆటHyd: చరిత్ర సృష్టించిన శుభమన్, వన్డేల్లో 200 రన్స్ చేసిన యంగెస్ట్ క్రికెటర్

Hyd: చరిత్ర సృష్టించిన శుభమన్, వన్డేల్లో 200 రన్స్ చేసిన యంగెస్ట్ క్రికెటర్

శుభమన్ గిల్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో డబుల్ సెంచురీ బాది తన సత్తా చూపారు శుభమన్. కేవలం 145 బంతుల్లోనే డబుల్ సెంచురీ చేశారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో శుభమన్ ఆట క్రికెట్ లవర్స్ ను అలరించింది. ఇలా వన్డేల్లో డబుల్ సెంచురీ చేసిన ఐదవ ఇండియన్ క్రికెటర్ గా ఆయన నిలిచారు. డబుల్ సెంచురీ ఫీట్ లో భాగంగా ఆయన 19 బౌండరీలు, 8 మ్యాసివ సిక్సులు కొట్టి ఆకట్టుకున్నారు. వన్డేల్లో ఇలా డబుల్ సెంచురీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు శుభమన్ గిల్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News