ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్‌ఎఫ్)లో భాగంగా జరిగిన ఫార్ములా 4 ఇండియన్ చాంపియన్‌షిప్ లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ డ్రైవర్ అకిల్ అలీభాయ్ చాంపియన్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో ఆరు రౌండ్లలో విజేతగా నిలిచిన అకిల్ ఆదివారం ఇక్కడి కరీ మోటార్ స్పీడ్‌వే పై జరిగిన ఫైనల్ రౌండ్ చివరి రెండు రేసుల్లో దక్షిణాఫ్రికాకు చెందిన అలీభాయ్ రెండు, మూడో స్థానాల్లో నిలిచినప్పటికీ ట్రోఫీ అవసరమైన పాయింట్లు సొంతం చేసుకున్నాడు. దాంతో ఈ సీజన్‌లో చాంపియన్‌షిప్ గెలుచుకున్నాడు.
ఆఖరి రోజు జరిగిన చివరి రెండు రేసుల్లో భారత డ్రైవర్, శ్రాచి రార్ రాయల్ బెంగాల్ టైగర్స్ కు చెందిన రుహాన్ అల్వా పోడియం ఫినిష్ చేసి అలీభాయ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. రెండో రేసులో రుహాన్ 26 నిమిషాల 55.114 సెకన్లలో అగ్రస్థానంతో ముగించాడు. అకిల్ అలీభాయ్ 27 నిమిషాల14.880) సెకన్లతో రెండో స్థానం సాధించగా, డివి నందన్(భారత్, బెంగళూరు స్పీడ్‌స్టర్స్, 27:24.987సె) మూడో స్థానం దక్కించుకున్నాడు. మూడో రేసులోనూ రుహాన్ అల్వా(27:00.884 సె) మొదటి స్థానం దక్కించుకోగా అకిల్ అలీభాయ్(27:16.425 సె) మూడో స్థానం సాధించాడు.