Wednesday, February 26, 2025
HomeఆటChampions Trophy: కష్టాల్లో సూపర్ సెంచరీ చేసిన ఇబ్రహీం జద్రాన్

Champions Trophy: కష్టాల్లో సూపర్ సెంచరీ చేసిన ఇబ్రహీం జద్రాన్

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా అఫ్ఘానిస్థాన్‌ – ఇంగ్లండ్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నెగ్గిన అఫ్ఘానిస్థాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని ఆడుతోంది. ఆదిలోనే 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఆఫ్ఘాన్ కష్టాల్లో పడింది. ఓవైపు మిగతా బ్యాటర్లు విఫలమవుతున్నా.. ఇబ్రహీం జద్రాన్(Ibrahim Zadran) సెంచరీతో అదరగొట్టాడు. 3 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 106 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకన్నాడు. అఫ్ఘానిస్థాన్‌ తరపున ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ బాదిన తొలి బ్యాటర్ కావడం విశేషం.

- Advertisement -

ఇక రహ్మానుల్లా గుర్బాజ్‌ 6, అటల్ 4. రహ్మత్ షా 4, షాహిది 40 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు, అదిల్ రషీద్, ఓవర్‌టన్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం ఆఫ్ఘాన్ స్కోర్ 42.3 ఓవర్లలో 235/5 చేసింది. ప్రస్తుతం క్రీజులో జద్రాన్ 120, మహ్మద్ నబీ 9 పరుగులతో ఉన్నారు.

ఇంగ్లండ్‌ జట్టు: ఫిల్‌ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్, బట్లర్, లివింగ్‌ స్టోం, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, అదిల్ రషీద్, మార్క్‌ వుడ్

అఫ్గానిస్థాన్‌ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అటల్, రహ్మత్, షాహిది, అజ్మతుల్లా , నబీ, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్‌హక్ ఫరూఖి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News