వన్డే, టెస్టు ఆఫ్ ది ఇయర్ జట్లను ప్రకటించిన ఐసీసీ.. తాజాగా టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024(ICC T20I Team Of The Year 2024) ప్రకటించింది. ఈ జట్టుకు సారథిగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఎంపిక చేసింది. ఇక భారత జట్టు నుంచి రోహిత్‌తో పాటు మరో ముగ్గురికి చోటు దక్కింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్య, అర్ష్‌దీప్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు. 2024లో జరిగిన టీ20 మెగా సమరంలో టీమింండియా విశ్వవిజేతగా అవతరించడంలో ఈ నలుగురు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024..
రోహిత్ శర్మ (కెప్టెన్; భారత్),
ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా),
ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్),
బాబర్ అజామ్ (పాకిస్థాన్),
నికోలస్ పూరన్ (వెస్టిండీస్),
సికందర్ రజా (జింబాబ్వే),
హార్దిక్ పాండ్య (భారత్),
రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్),
వానిందు హసరంగ (శ్రీలంక),
జస్ప్రీత్ బుమ్రా (భారత్),
అర్ష్‌దీప్ సింగ్ (భారత్)