Thursday, January 22, 2026
HomeఆటICC: ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. భారత ప్లేయర్లకు చోటు

ICC: ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. భారత ప్లేయర్లకు చోటు

ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024(ICC Women’s T20 Of The Year)ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. జట్టులో చోటు దక్కించుకున్న వారిలో విధ్వంసకర ఓపెనర్ స్మృతి మంధాన, వికెట్ కీపర్ రిచా ఘోష్, ఆల్ రౌండర్ దీప్తి శర్మలు ఉన్నారు. ఇక ఈ టీమ్‌కు కెప్టెన్‌గా లారా వోల్వార్డ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. కాగా గతేడాది భారత్ తరఫున స్మృతి మంధాన 23 టీ20 మ్యాచ్‌లు ఆడి 763 పరుగులు చేసింది. మరోవైపు రిచా 21 మ్యాచ్‌లలో 365 పరుగులు చేసింది. ఇక దీప్తి శర్మ 23 టీ20లు ఆడి 30 వికెట్లను తన ఖాతాలో వేసుకుంది.

- Advertisement -

టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్: లారా వోల్వార్డ్(కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అటపట్టు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్(వికెట్ కీపర్), మరిజాన్ కాప్, ఓర్లా పెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సాడియా ఇక్బల్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News