బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు (Shakib Al Hasan) భారీ షాక్ తగిలింది. అతడి బౌలింగ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కూడా నిషేధం విధించింది. అంతకుముందు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా షకీబ్ బౌలింగ్‌ను బ్యాన్ చేసింది. తాజాగా ఐసీసీ కూడా బ్యాన్ చేసినట్లు బంగ్లా క్రికెట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేసేందుకు వీల్లేదని పేర్కొంది.
కొంతకాలంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ షకీబ్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అతడికి బౌలింగ్ టెస్ట్ నిర్వహించింది. ఈ పరీక్షలో షకీబ్ మోచేయి నిబంధనలకు విరుద్ధంగా 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంగుతున్నట్టు తేలింది. దీంతో అతడిపై ఇంగ్లండ్ బోర్డు నిషేధం విధించింది.
కాగా 37 ఏళ్ల షకీబ్ అల్ హసన్ ఇప్పటిదాకా 71 టెస్టుల్లో 4,609 పరుగులు, 246 వికెట్లు తీశాడు. ఇక 247 వన్డేల్లో 7,570 పరుగులు చేసి, 317 వికెట్లు తీశాడు. అలాగే 129 టీ20ల్లో 2,551 పరుగులు, 149 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆల్ రౌండర్‌గా బంగ్లా క్రికెట్‌కు విశేషమైన సేవలు అందించాడు.