మరో మూడు రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) జరగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. అయితే ఈ మెగా టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్‌ల విషయంలో ఐసీసీ(ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్ ఆడే లీగ్ మ్యాచ్‌ల టికెట్లు విడుదల చేసిన ఐసీసీ.. తాజాగా స్పెషల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
అయితే సెమీఫైనల్ మ్యాచ్‌లకు పరిమితంగా టికెట్లు అందుబాటులో ఉన్నాయని ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం ఇంకా టికెట్లు విడుదల చేయలేదని తెలిపింది. ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరగాలి అనేది టీమిండియా విజయాలపై ౩ఆధారపడి ఉంటుందని చెప్పింది. సెమీస్‌లో భారత్ ఓడిపోతే తుది పోరు లాహోర్‌లో జరుగుతుందని సెమీస్‌లో టీమిండియా గెలిస్తే ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్ వేదికగా జరుగుతుందని పేర్కొంది.
కాగా ఈ మెగా టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా పోటీ పడనున్నాయి. వరల్డ్ కప్ తర్వాత ప్రతిష్టాత్మకమైన ఈ ట్రోఫీని గెలవాలని అన్ని జట్లు పట్టుదలతో ఉన్నాయి.