Monday, February 16, 2026
HomeఆటT20 World Cup 2026: వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

T20 World Cup 2026: వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

ICC Men’s T20 World Cup 2026 India schedule: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న ముంబైలో ఆడనుంది. ఈ 10వ ఎడిషన్ టీ20 వరల్డ్ కప్ లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. గతంలో కంటే ఈసారి పోటీ మరింత రసవత్తరంగా ఉండబోతుంది.

- Advertisement -

టీమ్ ఇండియా గ్రూప్ స్టేజ్ షెడ్యూల్:
భారత్ తన గ్రూప్ దశలో మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరగనుంది. గ్రూప్ స్టేజ్‌లో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 దశకు అర్హత సాధిస్తాయి. ఫిబ్రవరి 21, 2026 నుండి సూపర్ 8 మ్యాచులు ప్రారంభమవుతాయి.

ఫిబ్రవరి 07, 2026- భారత్ వర్సెస్ యూఎస్ఏ- వాంఖడే స్టేడియం, ముంబై

ఫిబ్రవరి 12, 2026- భారత్ వర్సెస్ నమీబియా- అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ

ఫిబ్రవరి 15, 2026- భారత్ వర్సెస్ పాకిస్థాన్- ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో

ఫిబ్రవరి 18, 2026- భారత్ వర్సెస్ నెదర్లాండ్స్- నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మాదాబాద్

Also Read: Salman Ali Agha -‘మా చేతుల్లో ఏమీ లేదు’.. భారత్‌తో మ్యాచ్ బహిష్కరణపై నోరు విప్పిన పాక్ కెప్టెన్..

లైవ్ ఎక్కడ చూడాలి?

టీవీ: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Star Sports Network).

ఆన్ లైన్: జియో హాట్‌స్టార్ (JioHotstar) యాప్ మరియు వెబ్‌సైట్.

టీమ్ ఇండియా ఫుల్ స్క్వాడ్:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News