ICC T20I Rankings 2026 Updates: టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే ఐసీసీ విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో వారు తమ ర్యాంకింగ్స్ ను గణనీయంగా మెరుగుపరుచుకున్నారు. ముఖ్యంగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన నంబర్ 1 స్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. ఇషాన్ కిషన్ ఏకంగా 32 స్థానాలు ఎగబాకి అందరినీ ఆశ్చర్యపరిచాడు. :
బ్యాటింగ్ విభాగంలో..
అభిషేక్ శర్మ (నెం.1): 917 రేటింగ్ పాయింట్లతో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కివీస్‌తో జరిగిన సిరీస్‌లో 249.32 స్ట్రైక్ రేట్‌తో 182 పరుగులు సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న ఫిలిప్ సాల్ట్ (ఇంగ్లాండ్) కంటే ఇతడు 83 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు.
ఇషాన్ కిషన్ (నెం.32): కివీస్‌పై 42 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాదిన ఇషాన్ కిషన్.. ఏకంగా 32 స్థానాలు ఎగబాకి 32వ ర్యాంకుకు చేరుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ (నెం.6): కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 728 పాయింట్లతో 6వ స్థానానికి చేరుకున్నాడు. కివీస్ సిరీస్‌లో అత్యధికంగా 242 పరుగులు చేసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.
తిలక్ వర్మ (నెం.4): సర్జరీ కారణంగా సిరీస్‌కు దూరమైన తిలక్ వర్మ ఒక స్థానం దిగజారి 4వ ర్యాంకులో నిలిచాడు. అయితే తాజాగా జరిగిన ప్రపంచకప్ వార్మప్ మ్యాచుల్లో తిలక్ సత్తా చాటి.. మెగా టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు.
Also Read: India Vs Afghanistan -రికార్డు ఛేజింగ్‌తో ఫైనల్‌కు యంగ్ ఇండియా!
బౌలింగ్ & ఆల్ రౌండర్ విభాగంలో..
బౌలింగ్ విభాగంలో టీమ్ ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాక్ బౌలర్ అబ్రార్ అహ్మద్ రెండో ర్యాంకులో ఉన్నాడు. భారత పేసర్లు అర్ష్ దీప్ సింగ్ 14, బుమ్రా 15 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ ప్లేయర్ సైమ్ అయూబ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అదరగొట్టి జింబాబ్వే ఆటగాడు సికందర్ రజాను వెనక్కి నెట్టి నంబర్ 1 ఆల్ రౌండర్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.

