Saturday, November 15, 2025
HomeఆటICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన శుభమన్‌ గిల్

ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన శుభమన్‌ గిల్

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ సత్తా చాటాడు. తన కెరీర్‌లోనే బెస్ట్ ర్యాంక్‌ను సాధించాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ అగ్రస్థానంలో నిలిచాడు. కొన్నేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ రెండో స్థానానికి పడిపోయాడు. తొలి రెండు స్థానాల్లో ఇంగ్లీష్‌ ఆటగాళ్లే ఉండటం విశేషం. ఇక మూడో స్థానంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌, టీమిండియా ఆటగాడు యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

- Advertisement -

ఇక టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండో టెస్టులో బ్యాటింగ్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులతో దుమ్మురేపగా.. రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులతో రాణించాడు. ఓవరాల్‌గా ఈ టెస్టులో 430 పరుగులు చేశాడు. దీంతో తన కెరీర్‌లోనే అత్యుత్తమ టెస్టు ర్యాంకింగ్ సాధించాడు. ఏకంగా 15 స్థానాలు ఎగబాకి టాప్ 10లో ఆరో ర్యాంకింగ్‌కు దూసుకెళ్లాడు. అలాగే బ్యాటింగ్‌లో రాణించిన భారత క్రికెటర్లు యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో, రిషభ్ పంత్ 8వ స్థానంలో నిలిచారు.

టాప్ 10 టెస్టు ర్యాంకింగ్స్(బ్యాటింగ్ విభాగంలో)

1. హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) – 886 ​​రేటింగ్ పాయింట్లు
2. జో రూట్ (ఇంగ్లాండ్) – 868 రేటింగ్ పాయింట్లు
3. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) – 867 రేటింగ్ పాయింట్లు
4. యశస్వి జైస్వాల్ (ఇండియా) – 858 రేటింగ్ పాయింట్లు: 858
5. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 813 రేటింగ్ పాయింట్లు
6. శుభమన్ గిల్ (ఇండియా) – 807 రేటింగ్ పాయింట్లు
7.టెంబా బావుమా (దక్షిణాఫ్రికా) – 790 రేటింగ్ పాయింట్లు
8. రిషబ్ పంత్ (ఇండగియా) – 790 రేటింగ్ పాయింట్లు
9. కమిందు మెండిస్ (శ్రీలంక) – 781 రేటింగ్ పాయింట్లు
10. జేమీ స్మిత్ (ఇంగ్లాండ్) – 753 రేటింగ్ పాయింట్లు

Also Read: లార్డ్స్ టెస్టు నుంచి నితీశ్ ఔట్..గంభీర్ శిష్యుడికి చోటు

మరోవైపు బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో మార్పులు చోటు చేసుకోలేదు. టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా అగ్ర‌స్థానంలోనే కొనసాగుతున్నాడు.

టాప్‌-5 టెస్టు ర్యాంకింగ్స్(బౌలింగ్ విభాగంలో)

జ‌స్‌ప్రీత్ బుమ్రా (ఇండియా) – 898 రేటింగ్ పాయింట్లు
క‌గిసో రబాడ (సౌతాఫ్రికా) – 851 రేటింగ్ పాయింట్లు
పాట్ క‌మిన్స్ (ఆస్ట్రేలియా) – 840 రేటింగ్ పాయింట్లు
జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 817 రేటింగ్ పాయింట్లు
నోమ‌న్ అలీ (పాకిస్తాన్‌) – 806 రేటింగ్ పాయింట్లు

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad