ICC Test Rankings 2025: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్ , రవీంద్ర జడేజా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.
టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్:
టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా మెుదటి స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో రబాడ ఉన్నాడు. సిరాజ్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచాడు. ఇంతక ముందు అతడు 27వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్టులో 9 వికెట్లు తీసి భారత జట్టు సిరీస్ కోల్పోకుండా చేశాడు. సిరీస్ మెుత్తం మీద 23 వికెట్లు తీశాడు. ఇక జడేజా మూడు స్థానాలు దిగజారి 17వ స్థానానికి పడిపోయాడు.
టాప్ 5 బౌలర్ల లిస్ట్:
- జస్ప్రీత్ బుమ్రా (భారత్)- 889 పాయింట్లు
2.కగిసో రబాడ (సౌత్ ఆఫ్రికా)- 851 పాయింట్లు
3.పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా)- 838 పాయింట్లు
4.మాట్ హెన్రీ (న్యూజిలాండ్)- 817 పాయింట్లు
5. జాష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా)- 815 పాయింట్లు
టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్:
ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా నుంచి ఒకే ఒక్క ఆటగాడు నిలిచాడు. ఇంగ్లండ్ పై చివరి టెస్టుల అద్బుత సెంచరీ సాధించిన యశస్వి మూడు స్థానాలు ఎగబాకి టాప్-5 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. భారత్ సిరీస్ లో రాణించిన జోరూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. హ్యారీ బ్రూక్ రెండో స్థానానికి ఎగబాకాడు.
టాప్ 5 బ్యాటర్స్ లిస్ట్:
- జో రూట్ (ఇంగ్లాండ్)- 908 పాయింట్లు
2. హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్)- 868 పాయింట్లు
3. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)- 858 పాయింట్లు
4. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 816 పాయింట్లు
5. యశస్వి జైస్వాల్ (భారత్)- 792 పాయింట్లు
Also Read: Mohammed Siraj first love – టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్
టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్
టెస్ట్‌లో నంబర్ 1 ఆల్ రౌండర్‌గా టీమిండియా సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా(405 పాయింట్లు) కొనసాగుతున్నాడు. ఇక రెండో స్థానంలో బంగ్లాదేశ్ ఆటగాడు మెహదీ హసన్ 305 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. జడేజా, హసన్ మధ్య 100 పాయింట్స్ తేడా ఉండటం విశేషం.
టాప్ 5 ఆల్ రౌండర్స్ లిస్ట్:
- రవీంద్ర జడేజా (భారత్)- 405 పాయింట్లు
2. మెహదీ హసన్ (బంగ్లాదేశ్)- 305 పాయింట్లు
3. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్)- 295 పాయింట్లు
4. వియాన్ ముల్డర్ (ఇంగ్లాండ్)- 284 పాయింట్లు
5. పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా)- 270 పాయింట్లు
Also Read: Indian Cricket Team – 2026 టీ20 వరల్డ్ కప్ వరకు టీమిండియా షెడ్యూల్ ఇదే..!


