Sunday, November 16, 2025
HomeఆటICC Rankings 2025: టాప్-5 కోల్పోయిన జైస్వాల్.. ఎగబాకిన సిరాజ్, జడేజా..

ICC Rankings 2025: టాప్-5 కోల్పోయిన జైస్వాల్.. ఎగబాకిన సిరాజ్, జడేజా..

ICC Test rankings Update: అహ్మదాబాద్ టెస్టులో వెస్టిండీస్ పై భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్టు మ్యాచ్ తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆటగాళ్లు సత్తా చాటారు. ముఖ్యంగా టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ర్యాంకింగ్స్ లో భారీ జంప్ ఉంది. కరేబియన్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో మెుత్తంగా 7 వికెట్లు పడగొట్టి ఏకంగా 12వ స్థానానికి చేరుకున్నాడు. సిరాజ్ మియా కెరీర్ లోనే అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించాడు. మరోవైపు అదే మ్యాచ్ లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయడంతో.. అతడు ర్యాంకింగ్స్ లో ఏడు స్థానాలు జంప్ చేసి 21వ స్థానానికి చేరుకున్నాడు. టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

- Advertisement -

విండీస్ తో తొలి టెస్టులో విఫలమైన భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్-5 ర్యాంక్ ను కోల్పోయాడు. అతడు రెండు స్థానాలు దిగజారి ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ ఏడో స్థానానికి దిగజారాడు. మరోవైపు అదే మ్యాచ్ లో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ తన ర్యాంకును మెరుగుపరుచుకుని 35 ర్యాంకుకు ఎగబాకాడు. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన జడేజా కూడా బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో దూసుకుపోయాడు. అతడు 25వ స్థానానికి చేరుకున్నాడు. కివీస్ యంగ్ ప్లేయర్ టిమ్ రాబిన్సన్ అయితే 58 మంది ఆటగాళ్లను వెనక్కి నెట్టి 22వ స్థానానికి చేరుకున్నాడు. ఈ ర్యాంకింగ్స్ లో జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Also Read: IND vs WI 2nd Test -రెండో టెస్టుకు టీమిండియా ఫ్లేయింగ్ XI ఇదే.. జట్టులో బుమ్రా ఉన్నాడా?

టెస్ట్ ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా హవా కొనసాగుతోంది. విండీస్ మ్యాచ్ లో వికెట్లు తీయడంతో ద్వారా తన రేటింగ్ పాయింట్లను మరింత పెంచుకున్నాడు. టీమ్ ఇండియా మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా తన ర్యాంకును మెరుగుపరుచుకుని 11వ స్థానానికి చేరుకున్నాడు. ఇక వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్ లో శుభ్ మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ, బౌలర్ల ర్యాంకింగ్స్ లో వరుణ్ చక్రవర్తి నంబర్ 1 స్థానంలో ఉన్నారు. టీ20 ఆల్ రౌండర్స్ జాబితాలో పాక్ ప్లేయర్ శాం అయ్యుబ్ టాప్ ర్యాంకును దక్కించుకున్నాడు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad