Saturday, November 15, 2025
HomeఆటWomen’s World Cup 2025: ఇండోర్ లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరే...

Women’s World Cup 2025: ఇండోర్ లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరే దారేది?

- Advertisement -

Women’s World Cup 2025 points table Update: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా.. ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా సెమీస్ రేసు ఉత్కంఠగా మారింది. నిన్న టీమ్ ఇండియాపై గెలవడంతో ఇంగ్లండ్ సెమీస్ కు చేరిన మూడో జట్టుగా నిలిచింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ-ఫైనల్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. ఇప్పుడు నాలుగో స్థానం కోసం మిగతా జట్లన్నీ పోటీపడుతున్నాయి. ఇంగ్లండ్ పై ఓడిపోవడంతో భారత్ సెమీస్ ఆశలు మరింత క్లిష్టతరంగా మారాయి. మన జట్టు సెమీస్ చేరాలంటే మిగతా రెండు మ్యాచుల్లో తప్పక గెలవాలి.

అగ్రస్థానంలో ఆసీస్..

పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానంలో ఉంది. ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచి తొమ్మిది పాయింట్లతో టాప్ లో కొనసాగుతోంది. ఆదివారం భారత్ పై గెలిచిన ఇంగ్లండ్ కూడా ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచి రెండో స్థానంలోనూ, సౌతాఫ్రికా కూడా ఐదింటిలో నాలుగు నెగ్గి మూడో స్థానంలో నిలిచింది. ఐదు మ్యాచుల్లో రెండు గెలిచిన భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఐదు మ్యాచుల్లో ఒక్కొక్కటి గెలిచిన న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. చివరి రెండు స్థానాల్లో శ్రీలంక, పాకిస్థాన్ నిలిచాయి.

Also Read: Smriti Mandhana-త్వరలో స్మృతి మంధాన ఇంట మోగనున్న పెళ్లి బాజాలు.. క్లారిటీ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్..

4 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు..

అక్టోబర్ 19న జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. హీథర్ నైట్ సెంచరీ(109)తో చెలరేగగా.. జోన్స్(56) హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మకు నాలుగు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన భారత్ నాలుగు పరుగులు తేడాతో ఓడిపోయింది. స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ మ్యాచ్ ను గెలిపించలేకపోయారు. బ్రంట్ రెండు వికెట్లు తీసింది. సెంచరీ చేసిన హీథర్ నైట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

 

 

 

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad