Ind-A vs Aus-A 2nd ODI Highlights: ఆస్ట్రేలియా-ఏతో జరిగిన రెండో వన్డేలో ఇండియా-ఏ ఘోర పరాజయం పొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ 45.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. తిలక్, పరాగ్ సత్తా చాటారు. వర్షం కారణంగా మ్యాచ్ ను 25 ఓవర్లలో 160కి కుదించారు. ఈ టార్గెట్ ను ఆస్ట్రేలియా-ఏ కేవలం 16.4 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. దీంతో కంగూరు జట్టు సిరీస్ 1-1తో సమం చేసింది. కీలక మ్యాచ్ అయిన మూడో వన్డే రేపు జరగనుంది.
చెలరేగిన తిలక్..
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏకు మంచి ఆరంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ ప్రభు సిమ్రాన్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. దీంతో ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన మన జట్టును ఆసియా కప్ పైనల్ మ్యాచ్ హీరో తిలక్ వర్మ ఆదుకున్నాడు. మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.
దీంతో తిలక్ కు జతకలిసిన పరాగ్ స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని సదర్ లాండ్ విడదీశాడు. పరాగ్ ను ఔట్ చేసి ఆసీస్ కు బ్రేక్ ఇచ్చాడు. అనంతరం వచ్చిన బ్యాటర్లు ఎవరూ తిలక్ కు సహకరించకపోవడంతో టీమిండియా 45.5 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. 94 పరుగులు చేసిన తిలక్ చివరి వికెట్ కు వెనుదిరిగాడు.
Also Read: IND vs WI 01st Test -ముచ్చటగా ముగ్గురు సెంచరీలు.. భారీ ఆధిక్యంలో భారత్..
ఛేజింగ్ సమయంలో వర్షం పడటంతో ఆస్ట్రేలియా టార్గెట్ 25 ఓవర్లలో 160కి కుదించారు. ఓపెనర్లు హర్వే, మెక్ గర్క్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా హార్వే చెలరేగి ఆడాడు. 36 పరుగులు చేసిన మెక్ గర్క్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన కాన్లీ కూడా సత్తా చాటాడు. ఇంకోవైపు హార్వే ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. దీంతో ఆ జట్టు 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.


