Tuesday, December 9, 2025
HomeఆటInd-A vs Pak-A: ఇండియాకు ఘోర పరాభవం.. సెమీస్ కు పాకిస్థాన్..

Ind-A vs Pak-A: ఇండియాకు ఘోర పరాభవం.. సెమీస్ కు పాకిస్థాన్..

India-A VS Pakistan-A Highlights: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీ ఆసక్తికరంగా సాగుతోంది. ఆదివారం భారత్-ఏతో జరిగిన మ్యాచులో పాకిస్థాన్- ఏ ఎనిమిది వికెట్లు తేడాతో గెలుపొందింది. టీమ్ ఇండియాపై విజయం సాధించడం ద్వారా సెమీఫైనల్స్ కు చేరిన తొలి జట్టుగా దాయాది జట్టు నిలిచింది.

- Advertisement -

దోహాలోని వెస్ట్ అండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ ఏ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమ్ ఇండియా 19 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ, నమన్ ధీర్ మాత్రమే రాణించారు. వైభవ్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేయగా..నమన్ 20 బంతుల్లో 6 ఫోర్లు,ఒక సిక్సర్ తో 35 పరుగులు చేశారు. కెప్టెన్ జితేష్ శర్ కేవలం 5 పరుగులే చేసి ఔటయ్యాడు. చివర్లో హర్ష్ దూబే మూడు ఫోర్లు కొట్టి మంచి స్కోరును అందించాడు. పాక్ బౌలర్లలో షాహిద్ అజిజ్ మూడు వికెట్లతో చెలరేగగా.. మసూద్, మాజ్ చెరో రెండు వికెట్లు తీశారు.

Also Read: Shubman gill-ఆసుపత్రిలో శుభ్‌మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగుతాడా?

అనంతరం దాయాది జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ ఓపెనర్ మాజ్ సదఖత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు కేవలం 47 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 79 పరుగులు చేసి ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. మరోవైపు మహ్మద్, యాసిర్ వికెట్లు త్వరగానే కోల్పోయిన పాక్ జట్టును మాజ్, మొహమ్మద్ ఫైక్ ఆదుకున్నారు. పైక్ అండతో మాజ్ రెచ్చిపోయి ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పాకిస్థాన్ జట్టు 13.2 ఓవర్లలో 137 పరుగులు చేసి సెమీస్ చేరింది. యాష్ ఠాకూర్, సుయాష్ శర్మ చెరో వికెట్ తీశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News