India vs Australia 2025 03rd ODI Preview: భారత్, ఆస్ట్రేలియా మధ్య నామమాత్రమైన చివరి వన్డే అక్టోబర్ 25, శనివారం జరగబోతుంది. ఈ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదిక కానుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీం ఇండియా ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ ను కోల్పోయింది. ఈ మ్యాచ్ లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని భారత్ చూస్తుంటే.. ఇందులో గెలిచి సిరీస్ను క్వీన్ స్వీప్ చేయాలనిఆసీస్ భావిస్తోంది. సిడ్నీ గ్రౌండ్ లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం, ఈ మ్యాచ్ ఉదయం 9 గంటలకు ప్రారంభంకానుంది.
సిడ్నీ వన్డేలో భారత్ జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు హర్షిత్ రాణా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లోనైనా కోహ్లీ పెద్ద ఇన్నింగ్ ఆడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కెప్టెన్ గిల్ కూడా భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. గత మ్యాచ్ లో గాడిలో పడిన రోహిత్, శ్రేయస్ ఈ మ్యాచ్ లోనూ అదే విధంగా ఆడాలని టీమ్ కోరుకుంటోంది. అక్షర్ ఫామ్ లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి బ్యాట్ తోపాటు బౌలింగ్ లోనూ రాణించాల్సి ఉంది.
అడిలైడ్ ఓవల్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. రోహిత్ శర్మ మరియు శ్రేయాస్ అయ్యర్‌ల అద్భుతమైన 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ అద్భుతంగా ఆడటంతో టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 264/9 పరుగులు సాధించింది. కంగూరు జట్టు 47 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మాథ్యూ షార్ట్ (78 బంతుల్లో 74 పరుగులు) మరియు కూపర్ కొన్నోలీ (53 బంతుల్లో 61* పరుగులు) అద్భుతంగా ఆడి జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. 10 ఓవర్ల స్పెల్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
Also Read: IND-W vs NZ-W- న్యూజిలాండ్ పై విజయం.. సెమీస్ చేరిన టీమ్ ఇండియా..
తుది జట్లు
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ [కెప్టెన్], ట్రావిస్ హెడ్, మాట్ షార్ట్, మాథ్యూ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కోనోలీ,మిచ్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్టార్క్/జాక్ ఎడ్వర్డ్స్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్/జోష్ హాజిల్‌వుడ్
ఇండియా: శుభ్‌మాన్ గిల్ [కెప్టెన్], రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్/కుల్దీప్ యాదవ్, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా/ప్రసిద్ధ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్


