IND vs AUS 2nd T20I live Score: మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
టాస్ ఓడి బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే దెబ్బతగిలింది. గిల్, సామ్సన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వికెట్లను త్వరగానే కోల్పోయింది. తిలక్ వర్మ డౌకట్ అయ్యాడు కేవలం టీమ్ ఇండియా 5 ఓవర్లలోనే 33 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ 24 పరుగులతో ఆడుతున్నాడు. హేజల్ వుడ్ కు మూడు వికెట్లు దక్కాయి.
ఆస్ట్రేలియా ఈసారి జట్టులో ఒక మార్పు చేసింది. జోష్ ఫిలిప్ స్థానంలో మాథ్యూ షార్ట్ ను తీసుకొచ్చింది. మిగతా వాళ్లే తొలి టీ20 మ్యాచ్ ఆడినవారే. మరోవైపు టీమ్ ఇండియా గత మ్యాచ్ లో కొనసాగించిన జట్టుతోనే బరిలోకి దిగింది. అయితే ఈసారి సంజూ సాంమ్సన్ ను వన్ డౌన్ లోకి పంపించి ప్రయోగం చేసింది సూర్య సేనా. అయితే అతడు కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
Also Read: IND vs AUS 2nd T20I- కాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా హైవోల్టేజ్ మ్యాచ్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI) – మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్ (జోష్ ఫిలిప్ స్థానంలో), జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మరియు జోష్ హాజిల్‌వుడ్.
భారతదేశం (ప్లేయింగ్ XI) – అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి మరియు జస్ప్రీత్ బుమ్రా.


