Saturday, November 15, 2025
HomeఆటIND vs AUS 2nd ODI: మళ్లీ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. బ్యాటింగ్ ఎవరిదంటే?

IND vs AUS 2nd ODI: మళ్లీ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. బ్యాటింగ్ ఎవరిదంటే?

IND vs AUS 2nd ODI live Score: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా.. రెండో వన్డే అడిలైడ్ లో ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను సమం చేయాలని భారత్ భావిస్తుండగా.. మరోసారి విజయం సాధించి సిరీస్ ను దక్కించుకోవాలని అతిథ్య జట్టు అనుకుంటోంది. ఈ క్రమంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. అడిలైడ్ లో భారత్ కు మంచి రికార్డు ఉంది. ఇక్కడ 15 మ్యాచులు ఆడితే.. 9 గెలిచి, 5 ఓడిపోయింది.

- Advertisement -

గత మ్యాచ్ లో విఫలమైన రోహిత్, కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారానైనా గాడిలో పడాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మరోవైపు కెప్టెన్ గిల్ కూడా భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. పెర్త్ వన్డేలో మంచి టచ్ లో కనిపించిన రాహుల్, అక్షర్ ఈ మ్యాచ్ లో కూడా అదే విధంగా ఆడాలని టీమ్ కోరుకుంటోంది. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఓ పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. అడిలైడ్ మ్యాచ్ లో భారత్ జట్టు మార్పులు ఏమీ చేయలేదు, పెర్త్ లో ఆడిన జట్టునే బరిలోకి దించింది. గత మ్యాచ్ లో చివరిలో రెండు సిక్సర్లు కొట్టి అలరించిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి మరోసారి అవకాశం దక్కింది.

Also Read: IND W Vs NZ W -భారత్-కివీస్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ నేడే.. ఎక్కడ చూడొచ్చంటే?

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad